ETV Bharat / sitara

'సైరా' దర్శకుడితో అఖిల్ కొత్త సినిమా

author img

By

Published : Sep 9, 2020, 10:24 AM IST

డైరెక్టర్​ సురేందర్​ రెడ్డి కొత్త సినిమా అఖిల్​తో చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Akkineni Akhil new movie confirmed in the direction of Surender Reddy
'సైరా..' దర్శకుడితో అక్కినేని వారసుడి కొత్త చిత్రం

అక్కినేని అఖిల్​ ఐదో సినిమా ప్రముఖ​ దర్శకుడు​ సురేందర్​ రెడ్డి తీయనున్నారు. ఈ విషయాన్ని ఏకే ఎంటర్​టైన్మెంట్స్​ బుధవారం అధికారికంగా ప్రకటించింది. అనిల్​ సుంకర నిర్మాతగా వ్యవహరించనున్నారు. సురేందర్​ రెడ్డికి ఇది 20వ చిత్రం. త్వరలో హీరోయిన్​, సంగీత దర్శకుడు సహా ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.

ఇప్పటికే పవన్​కల్యాణ్​తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు సురేందర్​ రెడ్డి. పవన్​ బర్త్​డే సందర్భంగా ప్రకటన కూడా వచ్చింది. 'వకీల్​ సాబ్​'తో పాటు క్రిష్, హరీశ్​ శంకర్​ సినిమాలతో పవన్ పనిచేయాల్సి ఉంది. అవన్నీ పూర్తయ్యేసరికి మరో ఏడాదైనా పడుతుంది. ఈ వ్యవధిలో అఖిల్​తో సినిమా పూర్తిచేసి విడుదల చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.