ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్​'తో పోటీలో బాలయ్య 'అఖండ'? - ఆర్ఆర్ఆర్ సినిమా

బాలయ్య 'అఖండ'ను దసరా కానుకగా థియేటర్లలోకి రానుందట. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం 'ఆర్ఆర్ఆర్'తో పోటీ తప్పదు! ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Akhanda
అఖండ
author img

By

Published : Aug 2, 2021, 7:15 PM IST

'సింహా', 'లెజెండ్'లాంటి బ్లాక్​బస్టర్​ల తర్వాత నందమూరి బాలకృష్ణ- బోయపాటి శీను కాంబినేషన్​లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్​ చిత్రం 'అఖండ'. దీని కోసం నందమూరి అభిమానులే కాదు.. సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీపై గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. 'అఖండ' చిత్రాన్ని దసర కానుకగా ప్రేక్షకులకు అందించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.

దసరా బరిలో..

ఇప్పటికే రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్​ఆర్​ఆర్​' అక్టోబర్​ 13న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మిగతా సినిమాలు రిలీజ్ డేట్​​ను వాయిదా వేసుకోగా.. బాలయ్య మాత్రం దసరాకే బరిలోకి దిగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే గనక నిజమైతే.. బాక్సాఫీస్​ ముందు 'అఖండ', 'ఆర్​ఆర్​ఆర్'​ మధ్య గట్టి పోటీ ఖాయం!

ఇప్పటికే వచ్చే సంక్రాంతి బరిలో 'రాధేశ్యామ్'​, 'సర్కారు వారి పాట', పవన్​కల్యాణ్- రానా​ మల్టీస్టారర్ చిత్రాలు ఉన్నాయి. దీంతో 'అఖండ' దసరాకే విడుదల చేయాలని దర్శకుడు బోయపాటి సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీని గురించి క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

తమిళనాడులోని ఓ పురాతన ఆలయంలో 'అఖండ' క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఇవీ చదవండి:

'బాలయ్యతో సినిమా అనగానే భయపడ్డా'

క్లైమాక్స్ షూటింగ్​లో బాలయ్య 'అఖండ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.