ETV Bharat / sitara

గోవాలో 'అఖండ' ఆటాపాట.. దసరాకు రిలీజ్​! - balakrishna latest news

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ'. ప్రస్తుతం గోవాలో ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్​తో చిత్రీకరణ పూర్తిచేసుకొని దసరా బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు చిత్రవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

akhanda
అఖండ
author img

By

Published : Sep 22, 2021, 6:59 AM IST

దసరా బరిలో(Akhanda Movie Release Date) నిలిచేందుకు సెట్స్‌పై శరవేగంగా ముస్తాబవుతోంది 'అఖండ'. ఇప్పటికే టాకీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు మిగిలిన పాట చిత్రీకరణకు సిద్ధమైంది. మంగళవారం నుంచి గోవాలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. వారం పాటు షూట్‌ ఇక్కడే కొనసాగనుందని.. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని చిత్ర వర్గాలు తెలిపాయి.

విభిన్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో సందడి చేయనున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మాత. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. పూర్ణ, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

అలరిస్తున్న 'అడిగా అడిగా' సాంగ్..

తాజాగా ఈ సినిమాలోని ఓ గీతాన్ని(balakrishna akhanda movie songs) విడుదల చేసింది చిత్రబృందం. 'అడిగా అడిగా' అంటూ సాగే ఈ లిరికల్​ వీడియో సాంగ్​ ​అలరిస్తోంది. తమన్ సంగీతం మరోసారి ఆకట్టుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అఖండ తర్వాత..

'అఖండ' తర్వాత బాలయ్య మరో కొత్త సినిమా(Balakrishna new movie) చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సరికొత్త కథతో సితార సంస్థ(sitara entertainments movies) ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి: బాలయ్య 'అఖండ' నుంచి ఫస్ట్​ సాంగ్ వచ్చేసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.