ETV Bharat / sitara

RRR Movie: 'ఆర్ఆర్​ఆర్​'లో అజయ్​ దేవ్​గణ్ పాత్ర ఇంతేనా? - ఆర్​ఆర్ఆర్​లో అజయ్​ దేవ్​గణ్ నిడివి

'ఆర్​ఆర్​ఆర్' సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్​గణ్ పాత్రకు (Ajay Devgan In Rrr) సంబంధించి ఆయన అభిమానులు నిరాశకు గురయ్యే విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఆయన చాలా తక్కువసేపు మాత్రమే కనిపించనున్నారని తెలుస్తోంది.

Ajay Devgn in rrr movie
ఆర్​ఆర్​ఆర్​లో అజయ్​ దేవ్​గణ్​
author img

By

Published : Nov 19, 2021, 8:54 PM IST

ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌ (Ram charan) హీరోలుగా రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'(RRR Movie). ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్​గణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే.. అజయ్ పాత్రకు(Ajay Devgan In Rrr) సంబంధించి... తన అభిమానులు నిరాశకు గురయ్యే వార్త ఒకటి బయటకొచ్చింది. ఈ సినిమాలో అజయ్ ఎక్కువ సేపు కాకుండా.. 8 నిమిషాల పాటు మాత్రమే కనిపిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ 8 నిమిషాలు.. సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాలని పేర్కొన్నాయి.

Ajay Devgn in rrr movie
'ఆర్​ఆర్​ఆర్​'లో అజయ్ దేవ్​గణ్ లుక్​

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'ఆర్​ఆర్​ఆర్​'.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటించారు. ఇప్పటికే విడుదలైన సినిమాలోని రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మరోవైపు.. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరెకెక్కించిన 'గంగూబాయ్ కతియావాడి'లోనూ.. అజయ్ దేవ్​గణ్ పాత్ర కేవలం 20 నిమిషాలే ఉండనుందని సమాచారం. ఆలియా భట్(Gangubai Kathiawadi Movie) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది.

ఇదీ చూడండి: 'ఆ పాత్రలో ఆమిర్ ఖాన్​ నటిస్తే బాగుంటుంది'

ఇదీ చూడండి: Movie Updates: బంగార్రాజు డైరీ బ్యూటీ.. సూర్య కొత్త సినిమా రిలీజ్ డేట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.