బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఐశ్యర్యరాయ్, దీపికా పదుకొణెకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. లాక్డౌన్ తర్వాత సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటున్న ఈ ఇద్దరి ఫొటోలు కొన్నిరోజలుగా వైరల్‌గా మారాయి. ఇప్పుడు వాటి గురించే అందరూ చర్చించుకుంటున్నారు. 'నిజం చెప్పండి మేడమ్' అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు.
అసలేం జరిగిందంటే?
చాలా కాలం విరామం తర్వాత ఐష్ కీలకపాత్రలో నటిస్తున్న దక్షిణాది చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ చెన్నై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. ఈ షూట్లో భాగంగా తాజాగా ఐష్ తన భర్త అభిషేక్‌తో కలిసి చెన్నై చేరుకున్నారు. ఈక్రమంలోనే నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. వరలక్ష్మి ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. వాటిని చూసిన పలువురు నెటిజన్లు.. ఐష్ తల్లికాబోతుందంటూ ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా 'ఐష్జీ కంగ్రాట్స్.. త్వరగా గుడ్‌న్యూస్ బయట పెట్టండి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐష్-అభిషేక్ దంపతులకు ఇప్పటికే ఆరాధ్య అనే పాప ఉంది.
మరోవైపు బీటౌన్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె-రణ్వీర్ సింగ్ విషయానికి వస్తే.. కొన్నేళ్లపాటు ప్రేమించుకున్న వీరిద్దరూ 2018లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం కెరీర్లో దూసుకెళ్తోన్న రణ్వీర్-దీపికా తాజాగా ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రి నుంచి బయటకు వస్తూ కనిపించారు. వాటిని చూసిన పలువురు.. వాళ్లిద్దరూ త్వరలోనే శుభవార్త బయటపెట్టనున్నారని.. వైద్య పరీక్షల నిమిత్తమే ఆస్పత్రికి వచ్చారని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఈ ఫొటోలు కూడా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.