హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో దూసుకెళ్తున్న నయనతార త్వరలో మరో సినిమాతో అలరించనుంది. ఆమె నటించిన తాజా చిత్రం 'ఐరా' తెలుగు ప్రచారచిత్రం బుధవారం విడుదలైంది. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- నయన్ తొలిసారిగా రెండు పాత్రల్లో నటించింది. "ఇప్పుడున్న ఇంటర్నెట్ తరంలో వివాదాస్పద అంశాలనే ప్రేక్షకులు చూస్తారు" అనే సంభాషణలతో ఉత్కంఠగా ట్రైలర్ రూపొందించారు. తమిళంలో తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో అనువాదం చేశారు.
ఈ ఏడాది 'విశ్వాసం', 'అంజలి సీబీఐ' లాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది ఈ అందాల భామ. ఇప్పుడు 'ఐరా' చిత్రంతో భయపెట్టేందుకు రెడీ అవుతోందీ కేరళకుట్టి. సార్జున్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కోటపాడి రాజేశ్ నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">