బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రిపోర్టును సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఈ కేసు విషయంలో ఓ స్పష్టతకు రావడానికి న్యాయపరమైన అంశాల గురించి కూడా ఆలోచించి వస్తుందని ఎయిమ్స్ ఛైర్మన్ డా. సుధీర్ గుప్తా వెల్లడించారు.
"ఎయిమ్స్, సీబీఐ.. సుశాంత్ కేసు విషయంలో ఓ ఒప్పందంలో ఉన్నాయి. ఈ కేసుపై తుది ఫలితాలు వెల్లడించే ముందు కొన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది."
-సుదీర్ గుప్తా, ఎయిమ్స్ ఛైర్మన్
సెప్టెంబర్ 7న సుశాంత్ శరీరంలో విషం ఉందనే అనుమానంతో పరీక్షలు నిర్వహించారు ఎయిమ్స్ వైద్యులు. ఈ కేసు విషయంలో మరిన్ని అంశాలు తెలుసుకునేందుకు ముగ్గురు ఎయిమ్స్ ఫోరెన్సిక్ వైద్యులతో టీమ్ ఏర్పాటుచేసింది సీబీఐ.
ప్రస్తుతం ఈ కేసు విషయంలో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్‌తో సంబంధాలున్నాయన్న అనుమానంతో వీరిని ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు.