పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరుకున్న క్రేజే వేరు. ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది అంటారు అభిమానులు. పవన్ నటించిన చిత్రాలు టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఇప్పుడీ హీరో సినిమా మరో రికార్డు సాధించింది. గతేడాది విడుదలైన 'అజ్ఞాతవాసి'.. యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ క్లబ్లో చేరింది.
పవన్ చివరి సినిమా 'అజ్ఞ్యాతవాసి'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. కానీ అభిమానులను మాత్రం అలరించలేకపోయింది. అయితే ఈ చిత్రం హిందీలో డబ్ అయి 100 మిలియన్ వ్యూస్ క్లబ్‌లోకి చేరింది.
ఇప్పటికే చాలా తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లకు అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. పవన్ అజ్ఞాతవాసి హిందీ వెర్షన్‌ను 'ఎవడు 3'గా విడుదల చేశారు. ఇప్పుడు యూట్యూబ్‌లో 100 మిలియన్ వీక్షణలను సొంతం చేసుకున్న మొదటి పవన్ కల్యాణ్ సినిమాగా నిలిచింది.
ఇవీ చూడండి.. చిరుతో త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది ఎప్పుడు?