ETV Bharat / sitara

'తుపాకీ-2' తర్వాత బన్నీతోనే!

author img

By

Published : May 27, 2020, 8:05 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​తో ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఓ సినిమా తెరకెక్కించనున్నారంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

బన్నీ
బన్నీ

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌తో మురుగదాస్‌ ఓ సినిమా చేయనున్నారన్న ప్రచారం చిత్ర పరిశ్రమలో ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయి కూడా. 'అల వైకుంఠపురములో' చిత్ర సమయంలో బన్నీ కూడా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. కానీ, ఆ ప్రాజెక్టు ఎందుకింకా కార్యరూపం దాల్చలేదన్నది స్పష్టతనివ్వలేదు. అయితే తమ కలయికలో సినిమా ఖాయమని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటిస్తానని అప్పట్లో బన్నీ చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడీ ప్రాజెక్టు విషయంలో మళ్లీ కదలిక వస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు సరిపోయే ఓ చక్కటి కథాంశంతో అదిరిపోయే స్క్రిప్ట్‌ను మురుగదాస్ రెడీ చేస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇది పాన్‌ ఇండియా స్థాయిలోనే ఉండనుంది.

ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇది గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన 'తుపాకీ'కి కొనసాగింపు. ఇది ఆగస్టు నాటికి సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 'తుపాకీ 2' తర్వాత బన్నీ చిత్రాన్నే పట్టాలెక్కించాలని లక్ష్యంతో ఉన్నారట మురుగదాస్‌. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్‌.. సుకుమార్‌ దర్శకత్వంలో 'పుష్ప' చిత్రంతో పాటు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో 'ఐకాన్‌' సినిమా చేయాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.