26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'మేజర్'. సోమవారం(మార్చి 15) ఆయన జయంతి సందర్భంగా చిత్ర గ్లింప్స్‌ను ట్వీట్ చేశారు.
ఈ సినిమాలో అడివి శేష్, సందీప్ పాత్రలో కనిపించనున్నారు. శోభిత దూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ కథానాయికలు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నిర్మిస్తుండగా, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది జులై 2న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఇది చదవండి: చిరకాల మిత్రుడితో చిరంజీవి సిక్కిం టూర్