'జంబలకిడిపంబ'తో తెలుగుతెరకు పరిచయమై, 'శుభలగ్నం'తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సీనియర్ నటి ఆమని(Actresses Amani). కెరీర్లో ఎన్నో మంచి పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(alitho saradaga latest episode) కార్యక్రమానికి నటి ఇంద్రజతో కలిసి హాజరై పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. కెరీర్లో హీరోయిన్ అవ్వాలనే పట్టుదలతో సినీఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే తాను సిగరెట్లు తాగిన విషయమై వివరణ ఇచ్చారు.
"జంబలకిడిపంబలో ఇలాంటి సీన్స్ ఉంటాయని డైరెక్టర్ చెప్పలేదు. ఆయన తింగరిదానా అని పిలిచేవారు. సెట్లో ఉన్నప్పుడు నన్ను పిలిచి 'నువ్వు ఇప్పుడు సిగరెట్ తాగే సీన్ ఉంది' అని చెప్పారు. నేను ఒక్కసారి స్టన్ అయ్యాను. 'రెండు, మూడు సార్లు పీల్చు అలవాటైపోతుంది అని' అన్నారు. ఇక నేను సిగరెట్ రెండు మూడు సార్లు పీల్చి అలవాటు చేసుకున్నాను. ఆ సీన్‌ను ఒక్క టేక్‌లో ఓకే చేశాను. మందు సీన్లోనూ ఏదో ఒక జ్యూస్ ఇవ్వమన్నాను. 'ఛాంపియన్ బాటిల్ ఓపెన్ చేస్తే పొంగిపోతుంది. దాన్ని అలానే తాగాలి' అన్నారు. పక్కనే ఉన్న నరేశ్ 'ఏమి అవ్వదు తాగేయ్. మొదటి సినిమాలోనే ఇలాంటి అవకాశం నీకు వచ్చింది. మాకు దొరకలేదు. ఎంజాయ్ చేయ్' అని కామెడీ చేశారు. అలా లైట్‌గా తాగాను. ఆ తర్వాత ఓ సారి మార్నింగ్ షూట్ కోసం తెల్లవారుఝామున కారులో వెళ్తుండగా వాతావరణం బాగుంది. రోడ్ సైడ్ ఓ బడ్డి కొట్టు దగ్గర కొంతమంది పొగ పీల్చుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా తాగాలనిపిచ్చింది. అలా కారు ఆపి అక్కడి వెళ్లి సిగరెట్ అడిగాను. వారు షాక్ అయ్యారు. నన్ను ఎవరు గుర్తుపెట్టలేదు. అలా మరోసారి సరదాగా స్టైల్‌గా స్మోక్ చేశాను."
-ఆమని, సీనియర్ నటి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అలా తినడమే ఇష్టం
దీంతోపాటు మామిడిపండ్లను కొనుగోలు చేసే కంటే.. దొంగలించి తింటే అందులో తియ్యదనం ఉంటుందని చెప్పింది ఆమని. "మామిడి తోటలను చూస్తే దొంగిలించి తినాలనే ఆలోచన వచ్చేస్తుంది. నేనే వెళ్లి దొంగతనంగా కాయ కోసి తింటాను. అందులో ఓ ఎంజాయ్మెంట్ ఉంటుంది" అని చెప్పింది.
హీరో అఖిల్ అంటే ప్రేమ..
'సిసింద్రి' సినిమాను గుర్తుచేసుకున్న ఆమని అందులో తన కుమారిడిలా నటించిన హీరో అఖిల్‌పై(hero akhil movies) తనకున్న ప్రేమను తెలిపింది. ఇప్పుడు కూడా అఖిల్ తనను అమ్మలా భావిస్తాడని.. అలానే తాను కూడా అతడిని బిడ్డలా భావిస్తానని చెప్పుకొచ్చింది. వీరిద్దరూ త్వరలోనే తల్లీకొడుకులుగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'(most eligible bachelor movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
కమర్షియల్ దర్శకులతో పాటు కళాత్మక దర్శకులైన బాపు, కె.విశ్వనాథ్‌ల సినిమాల్లోనూ ఆమని నటించారు. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని కొంతకాలం చిత్రాలకు దూరమయ్యారు. ఆ తర్వాత 'ఆ నలుగురు'తో రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇటీవల 'చావు కబురు చల్లగా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇదీ చూడండి: ఆమనిని పక్కకు పిలిచి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో!