ETV Bharat / sitara

త్రిషకు ఎలాంటి వరుడు కావాలంటే..! - trisha says love marriage

తాను ప్రేమ పెళ్లి చేసుకుంటానని చెప్పారు టాలీవుడ్​ సీనియర్​ హీరోయిన్​ త్రిష. అయితే ఆ వ్యక్తి తనను బాగా అర్థం చేసుకునే వాడు అయి ఉండాలని తెలిపారు.

Trisha
త్రిష
author img

By

Published : Nov 16, 2020, 9:57 PM IST

టాలీవుడ్​లో మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్​ హీరోయిన్స్​లో త్రిష ఒకరు. రెండు దశాబ్దాల నుంచి తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తూ అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తాను ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారో తెలిపారు.

"నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. అలాంటి వ్యక్తి దొరికేవరకు ఎదురుచూస్తుంటాను. అప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించను. నేను కోరుకున్న వ్యక్తి దొరకకపోతే జీవితాంతం ఒంటరిగా ఉండటానికైనా సిద్ధమే. తోడు దొరకలేదని అస్సలు బాధపడను."

-త్రిష, హీరోయిన్​

త్రిష.. 2003లో 'మౌనమ్​ పెసియాధే' సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. అనంతరం పలు చిత్రాల్లో నటించి చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పొన్నియన్​ సెల్వన్'​ సినిమాలో నటిస్తున్నారు.

ఇదీ చూడండి : హాట్ టాపిక్​గా మారిన శింబు-త్రిష పెళ్లి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.