సినీ నటి తమన్నా తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తన సామాజిక మాధ్యమాల ద్వారా తమన్నా స్వయంగా వెల్లడించింది. ఈ వారంలో తన తల్లిదండ్రుల్లో స్వల్ప కరోనా లక్షణాలు కనిపించాయని.. దీంతో ఇంట్లో ఉన్న అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పింది.
ఇంట్లో అందరూ కొవిడ్-19 పరీక్షలు చేయించుకోగా... రిపోర్టుల్లో తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు తెలిపింది. తనతో పాటు ఇతర కుటుంబసభ్యులకు నెగెటివ్ వచ్చిందని ఆ పోస్టులో పేర్కొంది. అందరి ప్రేమాభిమానాలతో వారు త్వరగా కోలుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది తమన్నా.
- — Tamannaah Bhatia (@tamannaahspeaks) August 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— Tamannaah Bhatia (@tamannaahspeaks) August 26, 2020
">— Tamannaah Bhatia (@tamannaahspeaks) August 26, 2020