స్టార్ హీరోయిన్ సమంత.. మరోసారి నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. ఇందుకు కారణం మాల్దీవుల విహారయాత్రలోని ఫొటోలే. ఓ రిసార్ట్‌లోని తీసుకున్న ఫొటోలను సామ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. గ్లామరస్‌గా ఉన్న ఆ ఫోజులు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి మార్కెట్‌ను సంపాదించుకున్న సమంత.. ప్రస్తుతం కొత్త చిత్రాలకు ఓకే చెప్పలేదు. ప్రస్తుతం ఆమె ఓటీటీ వేదికపైనే దృష్టిపెట్టింది. 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో ప్రతినాయక ఛాయలతో కూడిన పాత్ర చేసిన సమంత, ఆ సిరీస్ విడుదల కోసం ఎదురు చూస్తోంది. అలాగే 'ఆహా'లోనూ శ్యామ్ జామ్ అనే టాక్‌షో చేస్తోంది. వీటితో పాటు నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందునున్న హారర్ థ్రిల్లింగ్ చిత్రంలో సామ్ కనువిందు చేయనుంది.