Sarvanand Rashmika Adavallu meeku joharlu: "కొవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ కొంత డౌన్ అయిపోయారు. ప్రపంచంలో చాలా మార్పులొచ్చాయి. ఈ సమస్యలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా చేసే చిత్రం ఈ ఆడవాళ్లు మీకు జోహార్లు" అన్నారు నటి రాధికా శరత్‌కుమార్. ఆమె.. ఊర్వశి, ఖుష్బూ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక నాయకానాయికలుగా నటించారు. తిరుమల కిషోర్ తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ సినిమా మార్చి 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా నటి రాధిక చిత్ర విశేషాలను తెలిపారు.
"దర్శకుడు కిషోర్ నాకీ కథ చెప్తున్నప్పుడే విభిన్నంగా అనిపించింది. ఎందుకంటే.. ఓ హీరో పాత్రను సెంట్రిక్‌గా పెట్టుకుని ఆయన చుట్టూ ఉన్న మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కథ రాసుకున్నారు. అదే నాకు చాలా కొత్తగా అనిపించింది. చిత్రీకరణ పూర్తయ్యి.. ఫస్ట్ కాపీ తెరపై చూసుకున్నప్పుడు కూడా అదే భావన కలిగింది. సినిమాలో శర్వానంద్, రష్మికల నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఊర్వశి, ఖుష్బూలతో కలిసి చాలా సినిమాలు చేశాను. ఈ సినిమా చిత్రీకరణ ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. మా రోజుల్లో క్యారవాన్‌లు ఉండేవి కాదు. అందరం చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునే వాళ్లం. కలిసి భోజనం చేసే వాళ్లం. చాలా సంవత్సరాల తర్వాత అలాంటి వాతావరణం ఈ చిత్ర సెట్లో చూశా. సంతోషంగా అనిపించింది".
"ఎప్పటికైనా మార్పే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అప్పటికి ఇప్పటికీ మేకింగ్ పరంగా చాలా మార్పులొచ్చాయి. టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. కొత్త దర్శకులు, నటీనటులతోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. కుటుంబంతో కలిసి హాయిగా చూసే చిత్రమిది. ప్రతి ఒక్క ఫ్యామిలీ తప్పకుండా వెళ్లి సినిమా చూడండి".
"నేనిందులో శర్వానంద్ తల్లి పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర గురించి ఎక్కువ చెప్పలేను కానీ, క్రికెట్ టీమ్‌లో ధోనీలా ఉంటానన్నమాట. సెటిల్డ్ పర్సన్‌లా చాలా సైలెంట్‌గా ఉంటాను. కానీ, ఎప్పటికప్పుడు కథను ముందుకు నడిపిస్తుంటాను. పెద్దగా కామెడీ కూడా చేయను. ఈ సినిమాలో శర్వాకి ఐదుగురు తల్లులు ఉంటారు. ఒక్కో తల్లి ఒక్కో రకమైన ఆలోచనా విధానంతో ఉంటుంది. శర్వా వారందరినీ పెళ్లికి ఎలా ఒప్పించాడన్నది తెరపై చూడాలి".
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి:
Adavallu meeku joharlu: 'అదే ఈ సినిమాకు స్పెషల్‌గా నిలుస్తుంది'
''ఆడవాళ్లు మీకు జోహార్లు'తో ఓ కొత్త విషయాన్ని చెప్పబోతున్నాం'