మహేశ్‌బాబు హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నిజం'. అందులో బోల్డ్ క్యారెక్టర్లో నటించి అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది రాశి. ఆ పాత్రకు కొంతమంది నుంచి ప్రశంసలు దక్కగా.. మరికొంత మంది విమర్శించారు. అయితే దీని గురించి తెర వెనకు ఏం జరిగిందో రాశి తాజాగా వెల్లడించారు.
'నిజం' సినిమా దర్శకుడు ముందు తనకు చెప్పిన కథతో కాకుండా ఆ పాత్ర శైలి మార్చేసి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు రాశి. చిత్రీకరణ మొదటి రోజే వెళ్లిపోదామనుకున్నానని.. అప్పటికే అడ్వాన్స్ తీసుకొని అంగీకరించడం వల్ల అందులో నటించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. నటనకు మంచి మార్కులు లభించినా.. అలాంటి పాత్రలు మళ్లీ చేయొద్దని ఆమె అభిమానులు సూచించారని చెప్పారు. అయితే 'అత్తారింటికి దారేది' చిత్రంలో నదియా లాంటి పాత్రలను చేయడానికి సిద్ధమని తన కోరికను బహిర్గతం చేశారు.
ఇదీ చూడండి.. ''విరాటపర్వం' కోసం ఎదురు చూస్తున్నా'