బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్‌పై అత్యాచార ఆరోపణలు చేసిన నటి పాయల్ ఘోష్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే చీఫ్‌గా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో సోమవారం చేరింది.
ఘోష్ రాకతో పార్టీ బలం పుంజుకుందని ఈ సందర్భంగా రామ్‌దాస్ చెప్పారు. త్వరలోనే అనురాగ్ అరెస్టు అవుతారని అన్నారు. ఈ క్రమంలోనే పాయల్‌ను పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమించారు.
దేశ సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు పాయల్ చెప్పింది. అనురాగ్ కేసు విషయంలో తనకు మద్ధతుగా నిలిచిన అథవాలేకు ధన్యవాదాలు తెలియజేసింది.