అగ్ర కథానాయిక నయనతార గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆమెతోపాటు ప్రియుడు విఘ్నేశ్ శివన్, ఆయన కుటుంబ సభ్యులు కూడా విహారయాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా విఘ్నేశ్ సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. హాలిడేస్ నుంచి ట్రిప్ ఫీలింగ్‌లోకి వచ్చామని ఆయన అన్నారు.
నయనతార తెలుపు రంగు గౌనులో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, పువ్వులు కోస్తూ కనిపించారు. "తెలుపు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది" అని నయన్ ఫొటోలకు విఘ్నేశ్ క్యాప్షన్ ఇచ్చారు.
ఇదే సందర్భంగా తన తల్లి స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోల్ని ఆయన పంచుకుంటూ.. "అమ్మ ముఖంలో చిరునవ్వు నేరుగా మన హృదయాల్ని తాకుతుంది. మన తల్లిదండ్రుల సంతోషానికి మించిన సంతృప్తి, ఆనందం మరొకటి ఉండదు. ఓ విధంగా చెప్పాలంటే.. మన జీవిత లక్ష్యమే వారిని సంతోషంగా ఉంచడం" అని అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
గత కొన్నేళ్లుగా నయనతార, విఘ్నేశ్ ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇద్దరు మీడియా ముందు పరోక్షంగా చెప్పారు. నయన్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను విఘ్నేశ్ తరచూ సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వీరు విదేశాల్లో విహారయాత్రలకు వెళ్లి వచ్చారు.
వీరి నిశ్చితార్థం రహస్యంగా జరిగిందని, త్వరలోనే కుటుంబ సభ్యులు వివాహం చేయబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. వీటిపై విఘ్నేశ్ స్పందిస్తూ..."మా పెళ్లి గురించి వదంతులు వస్తూనే ఉన్నాయి. మేమిద్దరం వృత్తిపరంగా సాధించాల్సిన చాలా ఉన్నాయి. దానికి ముందే పెళ్లి గురించి ఆలోచించలేం. ప్రస్తుతానికి మేమిద్దరం చాలా ఆనందంగా ఉన్నాం" అని చెప్పారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">