ETV Bharat / sitara

'అమ్మనయ్యాక.. నా నటనలో మార్పు వచ్చింది!' - జ్యోతిక సూర్య

"పెళ్ళికి ముందు తను దక్షిణాదిన నంబర్‌ వన్‌ కథానాయిక. చిరంజీవి, నాగార్జున, కమల్‌హాసన్‌, రజినీకాంత్‌.. ఇలా పెద్ద స్టార్లందరితోనూ నటించేసింది!" - ఈ వాక్యాల్ని దక్షిణాది సినిమాల్లో పనిచేసిన టాప్‌ హీరోయిన్లు ఎవరికైనా కళ్లుమూసుకుని రాసేయొచ్చు. కానీ వాళ్లందరి నుంచి 'జ్యోతిక'ని ప్రత్యేకంగా నిలుపుతున్న విషయాలు చాలా ఉన్నాయి. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం హీరోయిన్‌గా మాత్రమే చేసిన జ్యోతిక ఇప్పుడు 'షీరో'గా అలరిస్తోంది. ఎంతో సాహసంతో కూడిన పాత్రలు చేస్తూ తనకీ ధైర్యం ఎలా వచ్చిందో చెబుతోంది.

Actress jyothika Interview
అమ్మనయ్యాక... నా నటనలో మార్పు వచ్చింది!
author img

By

Published : May 2, 2021, 9:12 AM IST

'హలో అండీ.. నేను శీతల్‌. మిమ్మల్ని చూసి చాలా కాలం అవుతోంది. మీవాడు బ్యాడ్మింటన్‌కి రావట్లేదా!' - నేను షూటింగ్స్‌లో ఉంటే ఇలాంటి మెసేజ్‌లు వస్తుంటాయి. మా పాపనీ, బాబునీ ప్రతిరోజూ క్లాసులకు తీసుకెళ్లేటప్పుడు అక్కడికి వాళ్ల పిల్లల్తో వచ్చే తల్లులు వీళ్లు.

వాళ్లందరికి ఒకప్పటి సినిమా స్టార్‌ జ్యోతికను కాదు నేను.. కేవలం దియా, దేవ్‌ల తల్లిని అంతే. ఉత్తరాదివాళ్లకైతే అది కూడా తెలియదు. ఖాళీగా ఉన్నప్పుడు ఈ తల్లులతోనే నా కాలక్షేపం. ఇప్పుడు మళ్లీ మేకప్‌ వేసుకుంటున్నాక వాళ్లు పంపిస్తున్న మెసేజ్‌లు చూస్తే 'నా ప్రపంచం ఒక్కసారిగా ఎలా మారిపోయిందో అనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్‌గా ఉంటూ ఓ ఇంటి కోడల్నై సినిమాలకు దూరం కావడానికి నన్ను నేను ఎంతగా మార్చుకోవాల్సి వచ్చిందో.. ఇద్దరు పిల్లల తల్లిగా మామూలు జీవితం గడుపుతూ వచ్చిన నేను మళ్లీ ఇటువైపు రావడానికీ అదే స్థాయిలో మార్పులకు లోనవ్వాల్సి వచ్చింది. ముందుగా ఆ ఫస్ట్‌ హాఫ్‌ గురించి చెబుతాను..

Actress jyothika Interview
జ్యోతిక

ఒకప్పుడు దక్షిణాది ప్రేక్షకుల్ని అలరించిన నగ్మా మా అక్కయ్య. మా నాన్న చందర్‌ సాధనా బాలీవుడ్‌ నిర్మాత. అమ్మ పేరు సీమ. నగ్మా కాకుండా నాకు మరో అక్కయ్య రాధిక, తమ్ముడు సూరజ్‌ ఉన్నారు. పదిహేడేళ్లకే బాలీవుడ్‌లో హీరోయినైపోయాను. కానీ 'దోలి సజా కే రఖ్నా' అన్న ఆ మొదటి సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది. దాంతో నాకు అక్కడ ఇంకే అవకాశాలూ రాలేదు.

అప్పుడే దక్షిణాదిలో కొందరు దర్శకనిర్మాతలు పిలిచి ఆడిషన్స్‌ చేశారు. వాటిల్లో 'పూవెల్లాం కేట్టుప్పార్‌'(తెలుగులో 'డీల్‌') అన్న సినిమాకు హీరోయిన్‌గా ఎంపికయ్యాను. సూర్య ఆ సినిమా హీరో. చెన్నైలోకి అడుగుపెట్టాక నాకు పరిచయమైన తొలి వ్యక్తి తనే! పలకరించిన తొలి నిమిషంలోనే ఆడవాళ్లకు తను ఇచ్చే మర్యాదను చూసి ఆశ్చర్యంలో మునిగిపోయాను. హీరోగా అతిదగ్గరగా నటించాల్సిన సీన్లలో కూడా అవసరానికంటే ఒక్క అడుగు కూడా ముందుకువేసేవాడు కాదు. పైగా నేనెక్కడ ఇబ్బంది పడతానోనని 'మీరు కంఫర్ట్‌గానే ఉన్నారు కదా!' అని పదేపదే అడుగుతుంటే నవ్వొచ్చేది. ఆ మంచితనం కారణంగానే ఆ సినిమాతో మేం మంచి ఫ్రెండ్స్‌ అయిపోయాం.

మేమిద్దరం నటించిన ఆ సినిమా రిలీజు కావడానికి కొద్దిగా ఆలస్యమైంది. ఈలోపు అజిత్‌ హీరోగా చేసిన 'వాలి'లో 'ఓ.. సోనా' పాటలో నటించాను. ఆ ఒక్కపాటకే నాకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వచ్చింది! ఆ తర్వాత వచ్చిన నా తొలి సినిమా కూడా సక్సెస్‌ కావడం వల్ల నా కెరీర్‌ గ్రాఫ్‌ అనూహ్యంగా ఎదిగిపోయింది. ఈలోపు ఎప్పుడని మేం గ్రహించేలోగానే మా స్నేహం ప్రేమగా మారింది! సినిమాల్లో నాకు తొందరగానే బ్రేక్‌ వచ్చినా.. సూర్యాకు కాస్త ఆలస్యమైంది. అప్పట్లో తన నటనను తీవ్రంగా విమర్శిస్తుండేవారు అందరూ. ఆ బాధను ఇద్దరం పంచుకుంటూ ఉండేవాళ్లం.

అప్పుడు దర్శకుడు బాల తీసిన 'నంద'తో తనకీ మంచి బ్రేక్‌ వచ్చింది. అప్పట్నుంచి ఇద్దరం బాగా బిజీ అయిపోయాం. గౌతం మేనన్‌ దర్శకత్వంలో ఇద్దరం కలిసి చేసిన 'కాక్క కాక్క' సూపర్‌డూపర్‌ హిట్టయ్యింది. సరిగ్గా అప్పుడే వాళ్లింట్లో మా ప్రేమ విషయం చెప్పాడు సూర్య. వాళ్లు వద్దనలేదు.. కానీ ఓకే కూడా చెప్పలేదు.

Actress jyothika Interview
జ్యోతిక

అత్తయ్య కండిషన్‌ పెట్టారు!

సూర్యవాళ్లది సంప్రదాయ తమిళకుటుంబం. వాళ్లనాన్నగారు శివకుమార్‌ సినీపరిశ్రమలో క్రమశిక్షణకీ, కట్టుబాటుకీ మారుపేరు. అందువల్లనో ఏమో అక్కడి నుంచి పచ్చజెండా ఊపలేదు. కానీ ఏదో ఒకరోజు మా ప్రేమను అంగీకరిస్తారని వేచి చూస్తూనే ఉన్నాం. ఈలోపు నేను అటు తెలుగులో చిరంజీవి, నాగార్జున, తమిళంలో రజినీకాంత్‌, కమల్‌హాసన్‌ ఇలా టాప్‌ హీరోలందరితోనూ నటిస్తూ వచ్చాను.

ఓ రోజు సూర్య తమ ఇంట్లోవాళ్లు పెళ్ళికి సమ్మతించారని చెప్పాడు. అది 2006వ సంవత్సరం ఆగస్టు నెల. అప్పటికి నేను నటిస్తున్నవి పోగా.. చేతిలో మరో నాలుగు సినిమాలుంటే వాటికి అడ్వాన్స్‌ తిరిగి ఇచ్చేశాను. ఆ తర్వాతి నెలే ఇద్దరం మూడుముళ్లతో ఒకటయ్యాం. నేను స్టార్‌ హీరోయిన్నే కావొచ్చు. బ్యాంకు ఖాతాలో బోలెడు డబ్బులూ ఉండొచ్చు. అయినా పెళ్ళయ్యాక ఓ మామూలు అమ్మాయిలాగే భయపడ్డాను.. 'మా ప్రేమకు ఓకే చెప్పడానికే వీళ్లు నాలుగేళ్లు టైం తీసుకున్నారు. కోడల్నైతే నన్నెలా చూసుకుంటారో ఏమో!' అని. కానీ, తొలిరోజు నుంచే వాళ్లు నన్ను తమ కూతురిగా మార్చేసుకున్నారు.

కాకపోతే, మా అత్తయ్య మాత్రం ఓ కండిషన్‌ పెట్టారు.. 'జ్యో.. మీ మావయ్యకీ నాకూ ఇంగ్లీషూ, హిందీ పెద్దగా రావు! సో.. నువ్వు మా భాష నేర్చుకోవాల్సిందే!' అని. 'తప్పకుండా అత్తమ్మా..' అంటూనే ఆ ఇంట్లో అడుగుపెట్టాను! మూడునెలల్లోనే ఆ భాషను మాట్లాడటం నేర్చుకున్నాను.. ఎంతగా అంటే.. వాళ్లబ్బాయి సూర్యకన్నా చక్కగా!

నా ప్రపంచం మారిపోయింది..

అత్తగారి ఇంటికెళ్లాక నా సినిమా కెరీర్‌ గురించి పూర్తిగా మరచిపోయాను. మా ఆయన సూర్య, మరిది కార్తి ఆ విశేషాలు చెబుతుంటే ఓ ప్రేక్షకురాలిగా కళ్లప్పగించి వినేదాన్ని అంతే. మా పాప దియా కడుపులో పడ్డాక అదీ మానేశాను. పుట్టబోయే పాప కోసం ఏం చేయాలి.. తను ఆరోగ్యంగా పుట్టాలంటే నేనేం తినాలి.. ఇలాగే సాగాయి నా ఆలోచనలన్నీ.

సినిమాల్లో చేసేటప్పుడు కాస్త బొద్దుగా ఉండేదాన్ని కదా.. గర్భందాల్చాక మరో 20 కేజీలు పెరిగాను. పాప పుట్టాక.. తన నవ్వులూ ముద్దుమాటల్తోనే మూడేళ్లు గడిచాయి. ఆ తర్వాత దేవ్‌ కడుపులో పడ్డాడు. వాడు పుట్టాక.. ఆ ఇద్దరు పిల్లలతోనే నా రోజంతా గడిచిపోయేది. వాళ్లకు ఓ మంచి స్కూల్‌లో సీటు సాధించాలనీ, చదువుతోపాటూ ఇతర అభిరుచులూ నేర్పించాలనీ.. ఇలా ఫక్తు తల్లిలాగే ఆలోచించాను.

మా పిల్లలకు స్కూల్‌ ఉన్న రోజుల్లో నేను ఐదుగంటలకు లేచి రెడీయై.. ఆరింటి నుంచి వాళ్లని రెడీ చేసేదాన్ని. ఏడింటికల్లా నేనే వెళ్లి డ్రాప్‌ చేసేదాన్ని. ఆ తర్వాత నాకు కాస్త సమయం దొరికితే టీవీ చూసేదాన్ని, మ్యూజిక్‌ వినేదాన్ని. ఒంటిగంటకి బడి నుంచి పిల్లలొస్తే.. వాళ్లకి తినిపించడం, ఆ తర్వాత పియానో క్లాసులకనీ, బ్యాడ్మింటన్‌కనీ తీసుకెళ్లడం. సాయంత్రం వాళ్ల నాన్న వచ్చాక అందరం కలిసి భోజనం చేయడం.. తొమ్మిదింటికల్లా ఠంచనుగా పిల్లలకు కథలు చెబుతూ పడుకోవడం! ఇదీ నా జీవితం.

Actress jyothika Interview
జ్యోతిక

అప్పుడే ఎవరో 'మీరు ఇప్పుడు హీరోయిన్‌ కాకపోవచ్చు కానీ.. కనీసం మీ శరీరాన్నయినా పట్టించుకోవచ్చు కదా, కాస్తయినా ఒళ్లు తగ్గొచ్చుకదా!' అన్నారు. సరే.. చూద్దామని ట్రెయినర్‌ దగ్గరకెళ్లి రెండేళ్లలో 30 కిలోలు తగ్గాను. అప్పుడే నేను మళ్లీ సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన వచ్చింది.. అబ్బే నాకు రాలేదు.. సూర్యకు వచ్చింది!

'నన్ను తిట్టిపోస్తున్నారు తల్లీ!'

'జ్యో.. నేను ఎక్కడికి వెళ్లినా జ్యోతిక అంత మంచి నటిని వంటింటి కుందేల్ని చేశావ'ని ఆడిపోసుకుంటున్నారు..' అని సూర్య ఓ రోజు అన్నాడు. 'మనిద్దరం కలిసి నటిస్తే ఎవరు చూస్తారు చెప్పండి?!' అన్నాను. 'ఇద్దరం కాదమ్మాయ్‌... నువ్వే చేస్తున్నావ్‌!' అంటూ ఓ డీవీడీని నాకు ఇచ్చాడు. మలయాళంలో పెద్ద హిట్టయిన 'హౌ ఓల్డ్‌ ఆర్యూ?' అన్న సినిమా అది. మంచి సినిమానే అనిపించింది కానీ నన్నింకా సందేహం వెన్నాడుతూనే వచ్చింది. 'సరే.. సినిమాల్లోకి వెళతాను కానీ ఎలాంటి సినిమాలు చేయాలి?' అన్న ప్రశ్న నన్ను స్థిమితంగా ఉండనివ్వలేదు.

పెళ్లైన హీరోయిన్లందరూ చేస్తున్నట్టు అక్కగానో, వదినగానో కనిపించడం నాకిష్టం లేదు. అలాగని కుర్ర హీరోయిన్లలా హీరోల చుట్టూ చేరి డ్యాన్సులు చేయలేను. ఏం చేయాలి..? అదివరకెప్పుడో నాకు ఇందుమతి అని ఓ డేరింగ్‌ మహిళా ఐఏఎస్‌ పరిచయమయ్యారు. ఆమెను సలహా అడుగుదామని వెళ్లాను. 'ఆడవాళ్లకు సంబంధించి ఎన్నో సమస్యలున్నాయి జ్యో..! ఒక్కోదాన్ని తీసి వాటి చుట్టూ కథలల్లుకోండి. వాటిపైన మాలాంటివాళ్లు లెక్చర్లివ్వడంకన్నా మీరు చెబితే గుండెల్లో నాటుకుపోతుంది!' అన్నారు. నేను మళ్లీ మేకప్‌వేయడానికి అలా ఆమె ఓ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ తర్వాత 'హౌ ఓల్డ్‌ ఆర్యూ?'కి ఓకే చెప్పాను.

తనే నిర్మాతయ్యాడు..

నా సినిమాకు నిర్మాతలెవ్వరూ దొరక్క చివరికి సూర్యానే ఆ బాధ్యత తీసుకున్నాడు. ఇందుకోసమే మా పిల్లలు దియా, దేవ్‌ల పేరుమీద '2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌' అని సంస్థను ప్రారంభించాడు. అలా ఎనిమిదేళ్ల తర్వాత సినిమా సెట్‌లోకి అడుగుపెట్టాను. కానీ మరో వారంలో షూటింగ్‌ అనగా 'నేను సెట్స్‌కు వెళితే పిల్లల్నెవరు చూస్తారు.. మధ్యాహ్నం వస్తే తింటారో లేదో!' అనడం మొదలుపెట్టాను. స్కూల్‌కీ, క్లాసులకీ మేం తీసుకెళ్తాం అన్నారు అత్తామామయ్యలు. కార్తీ ఏమో 'హోమ్‌వర్క్‌ నేను చేయిస్తాను వదినా!' అని హామీ ఇచ్చాడు. మా ఆయన సూర్య 'నేను సాయంత్రాల్లో తొందరగా వచ్చి చూసుకుంటాను!' అన్నాడు. అవన్నీ వీళ్లందరూ పర్ఫెక్ట్‌గా చేస్తారనడంలో సందేహం లేదు కానీ.. నా సమస్య అది కాదు కదా!

తల్లిగా వాళ్లకు దూరం కావడమే నా అసలైన బాధ. అందుకే పొద్దునే వాళ్లను స్కూల్‌కి రెడీ చేసే బాధ్యత నేనేచూస్తానని చెప్పాను. ఇదివరకటికంటే గంట ముందుగా లేచి ఆ రోజు షూటింగ్‌కు సంబంధించిన డైలాగులన్నీ నేర్చుకుని, ఆ తర్వాత పిల్లల్ని రెడీ చేసి పంపాకే సెట్‌లోకి వెళ్లడం మొదలుపెట్టాను.

Actress jyothika Interview
సూర్య కుటుంబం

కర్రసాము నేర్చుకున్నా..

'36 ఏళ్ల వయసులో' పెద్ద హిట్టయింది. ఆ తర్వాత మరో మంచి పాత్ర రావడానికి ఏడాదిన్నరపాటు వేచి చూడాల్సి వచ్చింది. అప్పుడే 'మగువలకి మాత్రమే' కథ వచ్చింది. ఇంట్లో వెట్టిచాకిరి చేయడం తప్ప ప్రపంచం తెలియని ముగ్గురు గృహిణులను ఓ మూడురోజులపాటు వెకేషన్‌కు తీసుకెళ్లి జీవితం అంటే ఏమిటో చెప్పే ఓ అల్ట్రామోడర్న్‌ అమ్మాయి పాత్ర నాది! దానికోసం హార్లీడేవిడ్సన్‌ బైకు నేర్చుకోవాల్సి వస్తే.. మా ఆయనే నేర్పించాడు. 'మగువలకి మాత్రమే' హిట్టు తర్వాత 'ఝాన్సీ' చేశాను. దర్శకుడు బాలా చిత్రమిది. అందుకే, వీలున్నంత పర్ఫెక్ట్‌గా ఉండాలని ఓ రెండు నెలలపాటు నటనలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని మరీ నటించాను. ఆ పాత్రకు జాతీయస్థాయిలో ప్రశంసలొచ్చాయి.

అప్పట్నుంచి వరసపెట్టి ఏడెనిమిది సినిమాలు చేశాను. అవన్నీ హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలే. కొన్ని సినిమాల కోసం కర్రసాము కూడా నేర్చుకోవాల్సి వచ్చింది! ఒకప్పుడు మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ఎంతగా కలలుకన్నా కుదర్లేదు. కానీ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాక ఆయనే పిలిచి 'నవాబ్‌'లో అవకాశం ఇచ్చారు! ఆ సినిమా చూసిన చాలామంది 'ఫస్ట్‌ ఇన్నింగ్స్‌కన్నా ఇప్పుడు గొప్పగా నటిస్తున్నారు..' అన్నారు. బహుశా-నా నటనలోని మార్పుకు తల్లితనమే కారణమై ఉండొచ్చు. ఎదుటివాళ్లవైపు నుంచి ఆలోచించడం, పరిణతితో అర్థం చేసుకోవడం, అవసరమైతే ఎంతటి సాహసానికైనా వెళ్లడం.. ఇవన్నీ మాతృత్వమే నాకు నేర్పింది. నేను చేస్తున్నదల్లా వాటిని నా నటనలో చూపించడం మాత్రమే!

ఇదీ చూడండి: 'చెర్రీతో సినిమా చేయాలనేది నా కోరిక!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.