ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు సినీప్రముఖులు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కరోనా నియంత్రణపై పోరాడుతోన్న వైద్యులకు చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. అయితే కొందరు మాత్రం రోడ్లపైకి వచ్చారు. ఇలా బయటకు వచ్చిన వారిపై మండిపడ్డాడు టాలీవుడ్ యువకథానాయకుడు విశ్వక్సేన్. కర్ఫ్యూ గడవక ముందే బైక్‌లపై తిరిగేంత పని ఏముందని ప్రశ్నించాడు.
-
Please stay safe at Home 🙏 #COVIDー19 #Covid_19india #JanataCurfew #Vishwaksen pic.twitter.com/eAnkqcnXau
— Team VishwakSen (@Vishwaksens_) March 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Please stay safe at Home 🙏 #COVIDー19 #Covid_19india #JanataCurfew #Vishwaksen pic.twitter.com/eAnkqcnXau
— Team VishwakSen (@Vishwaksens_) March 22, 2020Please stay safe at Home 🙏 #COVIDー19 #Covid_19india #JanataCurfew #Vishwaksen pic.twitter.com/eAnkqcnXau
— Team VishwakSen (@Vishwaksens_) March 22, 2020
ఇలాంటి సమయాల్లో ఇంటికే పరిమితమవ్వాలని సూచించాడు. ఎవరైనా బయట తిరుగుతూ కనిపిస్తే వారి వీడియోను పోస్ట్ చేయాలని.. అలా చేస్తే వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంటికి భోజనానికి వస్తానని చెప్పాడు. వారికి బహుమతులు అందిస్తానని అన్నాడు. అత్యవసర సమయంలో ప్రజలందరూ తమవంతు సహకారాన్ని అందించాలని కోరాడు.
-
#Vishwaksen Great words very valuable listen 🔥🔥🔥 pic.twitter.com/oMv0RNJ5Cd
— #RAMCHARAN ᴮᵈᵃʸᵀʳᵉⁿᵈᴼⁿ26ᵀᴴ (@Indra54026407) March 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Vishwaksen Great words very valuable listen 🔥🔥🔥 pic.twitter.com/oMv0RNJ5Cd
— #RAMCHARAN ᴮᵈᵃʸᵀʳᵉⁿᵈᴼⁿ26ᵀᴴ (@Indra54026407) March 22, 2020#Vishwaksen Great words very valuable listen 🔥🔥🔥 pic.twitter.com/oMv0RNJ5Cd
— #RAMCHARAN ᴮᵈᵃʸᵀʳᵉⁿᵈᴼⁿ26ᵀᴴ (@Indra54026407) March 22, 2020
సాయంత్రం 5 గంటలకు సౌండ్ చేయమన్నారు.. కానీ రోడ్లపై తిరగమని ఎవరు చెప్పలేదని మరో వీడియోలో వెల్లడించాడు. కర్ఫ్యూ కొనసాగుతున్నా టీ దుకాణాలు తీసి ఉండటంపై అసహనం వ్యక్తం చేశాడు. బయట సంచరించే వారంతా కలిసి కరోనాకు మందు కనిపెడుతున్నారా..? అని ఎద్దేవా చేశాడు.
ఇదీ చూడండి.. హాట్‌టాపిక్‌గా మారిన అల్లు అర్జున్ రెమ్యునరేషన్!