ETV Bharat / sitara

ఘనంగా సాయికుమార్​ షష్టిపూర్తి వేడుకలు - సినిమా వార్తలు

60 ఏళ్ల పడిలోకి అడుగుపెడుతున్న ప్రముఖ సినీనటుడు సాయికుమార్ షష్టిపూర్తి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు అగ్రతారలు హాజరయ్యారు.

sai kumar, actor
సాయి కుమార్,
author img

By

Published : Jul 25, 2021, 8:57 PM IST

Updated : Jul 25, 2021, 10:22 PM IST

ప్రముఖ సినీ నటుడు సాయికుమార్​ షష్టి పూర్తి వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్​లో జరిగిన ఈ వేడుకకు అగ్రనటులు చిరంజీవి, వెంకటేష్​, రాజశేఖర్- జీవిత జంట సహా పలువురు హాజరయ్యారు.

ఈ నెల 27న 60ఏళ్ల పడిలోకి అడుగుపెడుతున్న సాయికుమార్​కు మెగాస్టార్ చిరంజీవితో పాటు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. సాయికుమార్​ తనయుడు ఆదితో పాటు ఆయన కుటుంబసభ్యులు ఈ వేడుకలను అన్ని దగ్గరుండి చూసుకున్నారు.

తెలుగు సినీ అభిమానుల గుండెల్లో సాయికుమార్​కు ప్రత్యేక స్థానం ఉంటుంది. నటనతో పాటు తన డబ్బింగ్​తో తెలుగు, కన్నడ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు సాయికుమార్​.

అటు ఈటీవీ 'వావ్​'తో బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు సాయికుమార్​. జులై 27న పుట్టిన రోజు సందర్బంగా 'వావ్' ఎపిసోడ్​లో​ సాయికుమార్​ కుటుంబసభ్యులు అలరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆ పాటంటే కోపం..
'అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వుండగా..' అనే పాటంటే చాలా కోపమని సాయికుమార్​ సతీమణి సురేఖ నవ్వుతూ చెప్పారు. 'ఈ పాట వచ్చినప్పుడల్లా సాయికుమార్ డాన్స్​ చేయమంటారు, అందుకే ఈ పాట నచ్చదు' అని జవాబిచ్చారు. దీంతో పాటు తన ఇద్దరు సోదరులతో కలిసి 'దేవుడంటే ఒక్కడేరా' అనే డైలాగ్​ అద్భుతంగా చెప్పారు సాయికుమార్.

ఇదీ చదవండి:డ్రైవింగ్​ రాదు.. కొద్దిలో ప్రమాదం తప్పింది: సాయికుమార్

Last Updated : Jul 25, 2021, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.