ETV Bharat / sitara

సినిమాలు చేయనని జోక్ చేశా: కమెడియన్ రాహుల్ రామకృష్ణ - rahul ramakrishna priyadarshi

Rahul ramakrishna: తను ఇకపై సినిమాలు చేయనంటూ వస్తున్న వార్తలపై హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ స్పందించాడు. జస్ట్ జోక్ చేశానంతే అని చెప్పారు..

rahul ramakrishna news
రాహుల్ రామకృష్ణ
author img

By

Published : Feb 5, 2022, 8:24 PM IST

'2022. ఇదే నా చివరిది. ఇకపై సినిమాలు చేయను' అంటూ నటుడు రాహుల్‌ రామకృష్ణ(Rahul Ramakrishna) ట్వీట్‌ సోషల్‌ మీడియాలోనే కాదు, చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌ అయింది. ఇప్పుడు దీనిపై రామకృష్ణ స్పందించాడు.

"జోక్‌ చేశానంతే. భారీ రెమ్యునరేషన్‌, విలాసవంతమైన జీవితం, ఎన్నో ప్రయోజనాలు వస్తుంటే ఎందుకు కాలదన్నుకుంటాను. నేను రిటైర్మెంట్‌ ప్రకటించానని నా స్నేహితులు ఫోన్‌ చేసి మరీ చెప్పటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది" అని రాహుల్‌ రామకృష్ణ ట్వీట్‌ చేశారు.

అయితే, ఆయన ట్వీట్‌పై నెటిజన్ల మండిపడుతున్నారు. 'అసలా ట్వీట్‌ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు జోక్‌ అని ఎందుకు అనాలి', 'కామెడీ సినిమాల్లో చెయ్‌ అన్నా. ట్విటర్‌లో కాదు' అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు. 'అర్జున్‌రెడ్డి' విజయం తర్వాత వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ ఆయన కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్‌'లోనూ ఆయన ఓ రోల్‌ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.