ETV Bharat / sitara

మోహన్​లాల్.. 'ది కంప్లీట్ మ్యాన్' ఆన్ స్క్రీన్! - మోహన్​ లాల్ కెరీర్

సినిమాల్లో ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోతారు. పాత్రల్లో జీవించి ప్రేక్షకుల్ని తనలో లీనం చేసుకుంటారు. ఆయన నటిస్తుంటే కట్ చెప్పడం మర్చిపోయి పారవశ్యంతో అలాగే చూస్తుండిపోతారు దర్శకులు. ఆయన మరెవరో కాదు మలయాళ సూపర్​స్టార్ మోహన్​లాల్. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.

Mohanlal
మోహన్​లాల్
author img

By

Published : May 21, 2021, 12:44 PM IST

సంపూర్ణ నటనకు అసలైన నిర్వచనం మోహన్‌లాల్‌. అందుకే సినీలోకమంతా ఆయనను ‘ది కంప్లీట్‌ మ్యాన్‌’ అని పిలుచుకుంటుంది. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ రూపంలోకి మారిపోయినట్లు.. సినిమాల్లో ఏ పాత్రనిచ్చినా అందులోకి ఒదిగిపోతారు. పాత్రలో జీవించి.. ప్రేక్షకులను తనలో లీనం చేసుకుంటారు. తన నటన చూసి చప్పట్లు కొట్టినవారు, కన్నీళ్లు పెట్టుకున్నవారే కాదు. ఆయన నటిస్తుంటే కట్‌ చెప్పడం మర్చిపోయి పారవశ్యం చెందిన దర్శకులూ ఉన్నారు. అంతలా ముగ్ధుల్ని చేస్తుంది ఆయన నటన. ఇవాళ ఆ సంపూర్ణ నటశిఖరం పుట్టినరోజు.. ఈ సందర్భంగా మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!

మోహన్‌లాల్‌ అసలు పేరు మోహన్‌లాల్‌ విశ్వనాథ్‌ నాయర్‌. రెండు సార్లు కుస్తీ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచిన లాలెట్టన్‌. ఆరో తరగతిలోనే నటనలోకి అడుగుపెట్టారు. ఓ నాటకంలో 90 ఏళ్ల వృద్ధుడిగా నటించి అందరితోనూ ప్రశంసలు పొందారు. స్నేహితులు తీసిన 'తిరనోట్టమ్‌' సినిమాలో మొదటిసారి నటించారు. అయితే అది విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత స్నేహితుల బలవంతం మీద ఆడిషన్‌కి వెళ్లి 'మంజిల్‌ విరింజ పూక్కల్‌'లో విలన్‌ పాత్రకు ఎంపికయ్యారు. అది సూపర్‌ హిట్టయి సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి బలమైన పునాది వేసింది. ఆ తర్వాత అంచెలంచెలుగా మలయాళ సినిమాను శాసించే స్థాయికి ఎదిగారు. 'చిత్రం', 'కిరీడం', 'చంద్రలేఖ', 'నరసింహం', 'దృశ్యం', 'పులిమురుగున్‌', 'లూసిఫర్‌' లాంటి ఎన్నో మరపురాని చిత్రాలను అందించి మలయాళ సినిమాను మరో మెట్టెక్కించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వందకోట్ల క్లబ్‌ వీరుడు

'పులిమురుగన్‌'తో వందకోట్ల వసూళ్ల మార్క్‌ను అందుకొని ఈ ఘనత సాధించిన తొలి మలయాళ చిత్రంగా నిలిపారు. ఆ తర్వాత వచ్చిన 'లూసిఫర్‌' రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిపెట్టింది. ఈ వసూళ్లతో వందకోట్ల హీరో అయిపోయారు మోహన్‌లాల్‌. యంగ్‌ హీరోలకూ సాధ్యం కానీ ఈ ఘనత సాధిస్తూ.. తనకింకా వయసైపోలేదని నిరూపిస్తున్నారు.

మల్టీ స్టారర్లలోనూ ముందే..

ప్రతి చిత్ర పరిశ్రమలో ఉండే అగ్ర కథానాయకులు మల్టీస్టారర్‌ సినిమాలు తీసేందుకు వెనకాడతారు. కానీ విజయ్‌, విశాల్‌, ఎన్టీఆర్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ లాంటి ఈతరం హీరోల సినిమాల్లో నటించేందుకు సంకోచించలేదు ఈ సూపర్‌స్టార్‌. జిల్లా, విలన్‌(2017), జనతా గ్యారేజ్‌ చిత్రాల్లో యువ హీరోలతో పోటీపడీ మరీ నటించారు.

పరభాషలోనూ.. పాగా

కథలో దమ్ముండాలే కానీ, భాషతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తారాయన. 'ఇరువర్‌'తో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆనందన్‌ పాత్రకు ప్రాణం పోశాడు. ఆర్జీవీ తీసిన 'కంపెనీ'తో బాలీవుడ్‌కి వెళ్లిన ఆయన..'ఆగ్‌', 'తేజ్‌' సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. కన్నడనాట 'లవ్‌'లో ప్రత్యేక పాత్రలో మెరిశారాయన. తెలుగులో 'జనతా గ్యారేజ్‌' లాంటి హై వోల్టేజీ డ్రామాలో అంతే పవర్‌ఫుల్‌ పాత్రలో అదరగొట్టారు. 'మనమంతా' సినిమాతోనూ ఆకట్టుకున్నారు. 'ఇరువుర్‌' షూటింగ్‌ సమయంలో మోహన్‌లాల్‌ నటిస్తుంటే కట్ చెప్పడం మర్చిపోయేవారట ఆ సినిమా దర్శకుడు మణిరత్నం. "అతని నటన అంతగా సమ్మోహితుల్ని చేసింది. అలా ప్రతి సన్నివేశానికి చూస్తూ ఉండిపోతే సినిమా షూటింగ్‌ ఏం జరుగుతుంది చెప్పండి. అందుకే మోహన్‌లాల్‌తో షూటింగ్ చేయడం కష్టం" అంటారు మణిరత్నం.

కార్‌ డ్రైవర్‌ను నిర్మాతగా మార్చి..

షూటింగ్‌ సమయంలో తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేసేందుకు వచ్చిన ఆంటోని పెరంబవూర్‌ను కొంత కాలం తర్వాత నిర్మాతగా మార్చారు మోహన్‌లాల్‌. ఆయన మాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అయినా ఇప్పటికీ తాను మోహన్‌లాల్‌ డ్రైవర్‌ను అని చెప్పుకోవడానికే ఇష్టపడతానంటారు ఆంటోని. అతడితో స్నేహం చేయడమే కాదు, నిర్మాతగానూ మార్చిన లాలెట్టన్‌ మనసెంత విశాలమైందో ప్రపంచానికి తెలిసొచ్చింది.

అవార్డుల రారాజు..

మోహన్‌లాల్‌ ఇప్పటివరకూ మొత్తం 5 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ నటుడిగా రెండు, స్పెషల్‌ జ్యూరీ అవార్డులు విభాగాల్లో రెండేసి విభాగాల్లో అవార్డు కైవసం కాగా, నిర్మాతగా 'వానప్రస్థానం' చిత్రానికి మరో అవార్డు వచ్చింది. 17 కేరళ రాష్ట్ర అవార్డులు, 11 ఫిలిం ఫేర్‌ అవార్డులు తన కైవసం అయ్యాయి. సినిమాకు చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌ అవార్డులతో సత్కరించింది. మరెన్నో అవార్డులు తన కిరీటంలో చేరాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.