బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో జరిగే దీపావళి వేడుకను ఈసారి కరోనా దూరం చేసేసింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరవుతారు. అయితే.. ఈసారి వైరస్ ప్రభావమున్న దృష్ట్యా పండగకు దూరంగా ఉండనున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ కుమారుడు అభిషేక్ ధ్రువీకరించారు. తమ బంధువుల్లో ఒకరు చనిపోవడం కూడా వీటిని జరపకపోవడానికి కారణమని చెప్పారు. అభిషేక్ సోదరి శ్వేత అత్తయ్య ఇటీవలే మృతి మరణించారు.
"మా కుటుంబంలో మేం ఒకరిని కోల్పోయాం. దానికి తోడు కరోనా కలవరం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా వేడుకలను ఎలా చేసుకోగలరు. ఇప్పుడు భౌతిక దూరమే మన ఆయుధం. కానీ, అది కూడా వైరస్ సోకకుండా కాపాడుతుందన్న నమ్మకం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో దీపావళి లాంటి పండగలు జరుపుకోవడం కష్టమే"
-- అభిషేక్ బచ్చన్, నటుడు
అమితాబ్ కుటుంబంలో జయా బచ్చన్ మినహా అందరూ కొన్నాళ్ల క్రితం కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స చేసుకున్నారు. అందువల్ల వారంతా వైరస్‌ను కట్టడి చేసేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:రెండు రూపాయల కోసం ఇబ్బందిపడిన అమితాబ్