బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. ఇప్పటికే అధికభాగం షూటింగ్ పంజాబ్‌లో పూర్తి చేసుకుంది. కొన్ని కీలక సన్నివేశాలు తీసేందుకు లద్దాఖ్ వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో భారత్- చైనా దేశాల మధ్య నెలకొన్న హింసాత్మక పరిస్థితుల కారణంగా షెడ్యూల్ వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లద్దాఖ్‌లో షూటింగ్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో చిత్రీకరణను కార్గిల్‌కు మార్చే విషయమై ఆలోచిస్తోంది చిత్రబృందం. మరికొద్ది వారాల్లో ఈ విషయంపై ఓ స్పష్టత రానుంది.
![Aamir Khan cancels Laal Singh Chaddha's Ladakh schedule amid India-China border stand-off](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/laal_singh_chaddha-1_0607newsroom_1594011442_209.jpg)
'లాల్ సింగ్ చద్దా'.. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కావాల్సింది. కానీ అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తి కాకపోవడం వల్ల ఆ తేదీ కాస్త మారింది. కరోనా వల్ల మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది.
1994 టామ్ హాంక్స్ బ్లాక్ బాస్టర్ 'ఫారెస్ట్ గంప్' చిత్రానికి హీందీ రీమేక్‌గా దీనిని రూపొందిస్తున్నారు. అద్వైత్ చందన్ దర్శకుడు. కరీనా కపూర్, మోనా సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">