ETV Bharat / sitara

ఇండియాXఇంగ్లాండ్​: నిర్ణయాత్మక వన్డేలో గెలిచేదెవరు?

వన్డే సిరీస్‌లో భారత్‌-ఇంగ్లాండ్ మధ్య నిర్ణయాత్మక మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. ఇదివరకే టెస్టు, టీ20 సిరీస్‌లను గెలిచిన కోహ్లీసేన.. ఈ మ్యాచ్‌లో గెలిచి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. రెండో మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని చేధించిన ఇంగ్లాండ్.. అదే జోరుతో విజయంతో సిరీస్‌కు ముగింపు పలకాలని భావిస్తోంది. బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం కొనసాగుతున్న పుణెలో విజయం ఎటుమొగ్గుతుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

india
ఇండియా
author img

By

Published : Mar 28, 2021, 5:41 AM IST

Updated : Mar 28, 2021, 6:01 AM IST

టెస్టు, టీ20 సిరీస్‌ సంప్రదాయాన్నే భారత్-ఇంగ్లాండ్ జట్లు కొనసాగిస్తున్నాయి. వాటి మాదిరిగానే.. వన్డే సిరీస్‌లోనూ ఆఖరి మ్యాచే సిరీస్‌ విజేతను తేల్చనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం సాధించగా.. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ రికార్డు లక్ష్యాన్ని చేధించి జయభేరీ మోగించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో గెలవాలని ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి.

వారిద్దరిపై వేటు!

రెండో మ్యాచ్‌లో భారత జట్టు విసిరిన 337 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ అలవోకగా చేధించింది. స్పిన్నర్‌లు కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్‌ విధ్వంసం సృష్టించారు. 10 ఓవర్లు వేసిన కుల్దీప్.. 84 పరుగులిచ్చి వన్డేల్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు నమోదు చేశాడు. 6 ఓవర్లు వేసిన కృనాల్ పాండ్యా ఓవర్‌కు 12 పరుగుల చొప్పున 72 రన్స్ సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడో మ్యాచ్‌లో వీరిద్దరి స్థానంలో యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రెండో మ్యాచ్‌లో తొలి ఓవర్లలో నెమ్మదిగా ఆడిన భారత బ్యాట్స్‌మెన్‌.. తర్వాత జోరు పెంచి భారీ స్కోరు సాధించారు. గత కొన్ని రోజులుగా చివరి 15 ఓవర్లో భారత్‌ ఎక్కువగా పరుగులు చేస్తోంది. రిషభ్​ పంత్, హార్దిక్ పాండ్య చివరి ఓవర్లలో చెలరేగి ఆడుతుండటం జట్టుకు అదనపు బలంగా మారింది. ఆది నుంచే అటాకింగ్ గేమ్ ఆడుతున్న ఇంగ్లాండ్ అదే జోరుతో రెండో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సెంచరీ చేయడం కన్నా జట్టు విజయమే తనకు ముఖ్యమని స్పష్టం చేశాడు కెప్టెన్ కోహ్లీ. శతకం చేసినా జట్టు ఓటమిపాలైతే ఆ పరుగులకు అర్థం లేదన్నాడు. గణాంకాల కన్నా మనం ఎలా ఆడామన్నదానికే ప్రాధాన్యం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

సెంచరీ కంటే జట్టు గెలుపే ముఖ్యం..

2019 ఆగస్టులో చివరి సారిగా సెంచరీ చేసిన కోహ్లీ.. అప్పటి నుంచి మూడంకెల స్కోరును అందుకోలేదు. ఈ మ్యాచ్‌లోనైనా విరాట్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడి.. సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. బ్యాటింగ్‌లో రాణిస్తున్న హార్దిక్ పాండ్య.. బౌలింగ్ కూడా చేస్తున్నాడు. ప్రపంచకప్‌ దృష్ట్యా అతడిపై పనిభారం పడకుండా చూసుకోవాలని భారత జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. భారత్ బౌలింగ్ దళానికి భువనేశ్వర్‌ కుమార్‌ నేతృత్వం వహిస్తున్నాడు. ఇక శార్దుల్ ఠాకూర్‌కు బదులు యార్కర్ కింగ్ నటరాజన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్‌లో ఒకరు తుది జట్టులో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

కనీసం వన్డే సిరీస్​ అయినా..

రెండో వన్డేలో కనబర్చిన ఆటతీరు పట్ల ఇంగ్లాండ్ సంతోషంగా ఉంది. ఇదే ఊపులో మ్యాచ్‌ గెలిచి వన్డే సిరీస్‌ కైవసం చేసుకోవాలని ఊవిళ్లూరుతోంది. ఈ పర్యటనలో ఆశించిన మేర ప్రభావం చూపలేకపోయిన ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మరి మ్యాచ్‌ గెలిచి అభిమానులకు టీమ్​ఇండియా హోలీ కానుక ఇస్తుందా.. ఇంగ్లాండ్‌ పరమవుతుందా అనేది తేలాల్సి ఉంది.

ఇదీ చదవండి: బాలికల విద్య కోసం 4 ఎడారుల్లో అల్ట్రా మారథాన్​!

Last Updated : Mar 28, 2021, 6:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.