ఇటీవల కాలంలో కొన్ని తెలుగు పాటలు ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో హత్తుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి యువత ఫిదా అయిపోతోంది. పాట బాగుంటే అది పెద్ద సినిమానా? చిన్న సినిమానా? అని చూడటం లేదు. నెట్టింట ఎంతో ఆదరిస్తున్నారు. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేస్తున్నాయి. తాజాగా బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్ కథానాయకుడిగా నటించిన చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. అమృత అయ్యర్ కథానాయిక. మున్నా దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులోని 'నీలి నీలి ఆకాశం..' పాట విడుదలై యువతను ఆకట్టుకుంటోంది. ఎంతలా అంటే ఇప్పుడు 150 మిలియన్ వ్యూస్(అన్ని సోషల్‌మీడియా ఫ్లాట్ ఫాంలు కలిపి) క్లబ్‌లో చేరిన ప్రేమగీతంగా నిలిచినట్లు చిత్ర బృందం వెల్లడించింది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన స్వరాలకు చంద్రబోస్ అందించిన సాహిత్యం పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. యూట్యూబ్, మ్యూజిక్ ఛానళ్లు, ఎఫ్‌ఎం రేడియోల్లో ఈ పాట మార్మోగిపోతోంది. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఉగాది కానుకగా మార్చి 25న ఈ సినిమా విడుదల కావాల్సింది. కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. మరి వెండితెరపై యువతను ఎలా అలరిస్తుందో చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">