World's Largest Power Bank: దూర ప్రయాణాలు చేసేటప్పుడు, ఒక్కోసారి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయినప్పుడు పవర్ బ్యాంకులు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే పవర్ బ్యాంకులు సాధారణంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు ఛార్జింగ్ పెట్టుకునేంత పరిమాణంలోనే ఉంటాయి. కానీ చైనాకు చెందిన ఓ వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద పవర్‌బ్యాంకును రూపొందించాడు. ఈ పవర్ బ్యాంకు 27,000,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగి ఉంది. అయితే ఈ పవర్‌బ్యాంకును వ్యర్థాలతోనే తయారు చేశారట!
చైనాకు చెందిన హాండీ జెంగ్ ఈ పవర్ బ్యాంకును తయారు చేశారు. పవర్ బ్యాంకు ప్రత్యేకతలు, తయారీ విధానం.. ఇలా పూర్తి సమాచారన్ని వీడియోగా తీసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు జెంగ్.
సాధారణ పవర్‌బ్యాంక్ లానే..
ఇతర పవర్ బ్యాంక్లానే ఇది కూడా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు జంగ్. గతంలో ఎలక్ట్రిక్ కార్లలో వినియోగించే బ్యాటరీ కంటే పెద్ద బ్యాటరీని ఈ పవర్బ్యాంకులో అమర్చారు. ఎలక్ట్రిక్ వైర్లు, ఇతర పరికరాలు పైకి కనబడకుండా కింద నుంచి వైరింగ్ చేశారు.
పవర్‌బ్యాంకు అటూఇటూ తిరిగేందుకు వీలుగా అడుగు భాగంలో చక్రాలను అమర్చారు. దీంతో పవర్‌బ్యాంకును ఎక్కడికైనా తీసుకెళ్లి వినియోగించుకోవచ్చు.
ఈ పవర్ బ్యాంకు పరిమాణం 5.9 అడుగుల పొడవు, 3.9 అడుగుల వెడల్పు.
ప్రత్యేకతలు ఏంటి..?
- ఈ పవర్ బ్యాంకు 27,000,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగి ఉంది.
- మొత్తం 60 పోర్టులు ఉన్నాయి.
- 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న 5వేల మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ చేసేంత సామర్థ్యం.
- ల్యాప్టాప్స్, టాబ్లెట్స్, అంతేకాక టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లలకూ విద్యుత్ సరఫరా చేయవచ్చు.
- పవర్‌బ్యాంకు అడుగుభాగంలో చక్రాలు అమర్చడం వల్ల ఎక్కడికైనా తీసుకెళ్లి ఛార్జింగ్ చేసుకోవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: జీమెయిల్ అకౌంట్ లాక్ అయిపోయిందా? ఇలా చేయండి!