ETV Bharat / science-and-technology

ఐటీ రూల్స్ ఎఫెక్ట్​- వాట్సప్​లో 22లక్షల అకౌంట్లు రద్దు

మే నెలాఖరు నుంచి అమలులోకి వచ్చిన నూతన ఐటీ చట్టాలకు అనుగుణంగా కంటెంట్ (WhatsApp action)​ విషయంలో చర్యలు ప్రారంభించాయి సామాజిక మాధ్యమాలు​. యూజర్లు ఫిర్యాదు, రిపోర్ట్ చేసిన కంటెంట్​ను (watsapp content analysis) తొలగిస్తున్నట్లు తెలిపాయి. దీనికి సంబంధించిన వివరాలను మెటా(ఫేస్​బుక్​ మాతృసంస్థ)​, గూగుల్ ప్లాట్​ఫామ్ నెలవారీ నివేదికను విడుదల చేశాయి. ఏ మేరకు కంటెంట్​ను తొలగించాయంటే..

WhatsApp banned
గూగుల్ కంటెంట్​ బ్యాన్
author img

By

Published : Nov 2, 2021, 9:17 AM IST

యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు.. సెప్టెంబర్​లో 76,967 పోస్ట్​లు/ఆర్టికల్స్​ను.. తమ ప్లాట్​ఫామ్​ నుంచి తొలగించినట్లు (watsapp content analysis) సెర్చ్​ ఇంజన్ దిగ్గజం గూగుల్​ ప్రకటించింది. దీనితోపాటు.. ఆటోమెటిక్ డెటెక్షన్ ద్వారా 4,50,246 అభ్యంతరకర అంశాలను తొలగించినట్లు నెలవారీ 'ట్రాన్స్​పరెన్సీ రిపోర్ట్​'లో పేర్కొంది.

మే 26 నుంచి అమలులోకి వచ్చిన నూతన ఐటీ చట్టాలకు అనుగుణంగా.. ఈ చర్యలకు ఉపక్రమించినట్లు (google complaints team) గూగుల్ స్పష్టం చేసింది. వ్యక్తిగత యూజర్ల నుంచి.. సెప్టెంబర్​లో 29,842 ఫిర్యాదులు వచ్చినట్లు​ వెల్లడించింది. తమ ప్లాట్​ఫామ్​​ నుంచి తొలగించిన కంటెంట్​లో కాపీరైట్ (76,444), ట్రేడ్​మార్క్​ (493), ఇతర చట్టపరమైన (11), పరువు నష్టం (2), గ్రాఫిక్ అశ్లీల కంటెంట్​ (11) కేటగిరీలు ఉన్నట్లు తెలిపింది గూగుల్​.

మెటా..

నూతన ఐటీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ నెలకు 2.69 కోట్ల కంటెంట్​పై ఫేస్​బుక్​ చర్యలు (facebook action report) తీసుకుంది. ఫేస్​బుక్​ ప్లాట్​ఫామ్​లో యూజర్ల నుంచి 708 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఫేస్​బుక్ మాతృసంస్థ మెటా తెలిపింది. అందులో 589 కేసులు పరిష్కరించినట్లు వెల్లడించింది.

ఇన్​స్టాగ్రామ్​ సెప్టెంబర్​ నెలకు 32 లక్షల పోస్ట్​లు/ఆర్టికల్స్​ను తొలగించినట్లు తన ట్రాన్స్​పరెన్సీ రిపోర్ట్​లో తెలిపింది. వినియోగదారుల నుంచి 418 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది.

వాట్సప్​..

భారత్​లో ఐటీ రూల్స్​కి (IT rules in india) అనుగుణంగా చర్యలు ప్రారంభించిన వాట్సాప్​ తన నాలుగో నెలవారీ నివేదికను వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘించిన 22 లక్షల అకౌంట్లను సెప్టెంబర్​లో రద్దు చేసినట్లు వాట్సప్​ తెలిపింది. యూజర్ల నుంచి 560 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి:ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఆటో కరెక్ట్‌ ఫీచర్‌ను డిసేబుల్ చేయండిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.