ETV Bharat / science-and-technology

'I'm not a robot' ఎందుకు వస్తుంది?.. అది ఎలా వర్క్ చేస్తుందో తెలుసా!

ఇంటర్నెట్ లేకపోతే మనిషి బ్రలేకలేనంతగా ప్రస్తుతం ప్రపంచం మారిపోయింది. అది అందరికీ తప్పనిసరి సాధనంగా మారింది. ఇంటర్నెట్ అందుబాటులో లేకపోతే ఏ పని చేయలేనంతగా వినియోగం పెరిగిపోయింది. ఒక్క నిమిషం ఇంటర్నెట్ ఆగిపోతే ప్రపంచంలో ఎన్నో పనులు ఆగిపోతాయంటే.. అది ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంటర్నెట్‌లో జరిగే వాటిల్లో చాలా విషయాలు మనకు తెలియవు. వాటిల్లో క్యాప్చా టెస్ట్ ఒకటి. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం.

what-is-i-am-not-a-robot-captcha-how-does-i-am-not-a-robot-captcha-work
ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అని ఎందుకు వస్తుంది
author img

By

Published : Apr 30, 2023, 9:16 PM IST

ప్రస్తుతం కాలంలో సాంకేతికత రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత అత్యంత వేగంగా విస్తరిస్తోంది. మొబైల్ లేదా ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరి సాధనంగా మారిపోయింది. ఈ రెండు వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం మన అరచేతిలోకి వచ్చింది. ఏ సమాచారం కావాలన్నా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుంటున్నాం.

అయితే ఇంటర్నెట్ వాడే ప్రతిఒక్కరికీ 'ఐ యామ్ నాట్ ఏ రోబోట్' అనే క్యాప్చా తెలిసే ఉంటుంది. ఏదైనా పని కోసం మనం ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు ఈ క్యాప్చా కనిపిస్తుంది. ఇలా వచ్చినప్పుడు పక్కన ఉన్న బాక్స్‌లో టిక్ చేస్తే కానీ ఇంటర్నెట్‌లో ఏదైనా పని చేసుకోవడానికి వీలవుతుంది. 'ఐ యామ్ నాట్ ఏ రోబోట్‌' అనేదే కాకుండా.. క్యాప్చాలలో విభిన్న విధానాలు ఉంటాయి. వివిధ రకాల బొమ్మలు వచ్చి వాటిల్లో సరైన వాటిని ఎంపిక చేయాలని కోరుతుంది. వాటిని సరిగ్గా ఎంపిక చేస్తేనే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా ఎందుకు వస్తాయి? అవి ఎలా పనిచేస్తాయి? అనే విషయం చాలా మందికి తెలియదు.

వినియోగదారుడి సమాచార భద్రత, వెబ్‌సైట్ల రక్షణ కోసమే ఈ క్యాప్చా పద్దతిని తీసుకొచ్చారు. 2000వ సంవత్సరంలో దీనిని అభివృద్ది చేశారు. అన్ని వెబ్‌సైట్లు ఇప్పుడు భద్రత కోసం క్యాప్చా పద్దతిని పాటిస్తున్నాయి. ఆటోమేటిక్‌గా పని చేసే ఈ ప్రోగ్రాములు, రోబోల సాయంతో వెబ్‌సైట్లను ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు వాటిపై ఒత్తిడి పెరిగి క్రాష్ అవుతాయి. సర్వర్లు డౌన్ అవ్వడమే కాకుండా వైరస్ అటాక్‌లు జరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల వెబ్‌సైట్లతో పాటు వినియోగదారుడి సమాచారానికి కూడా భద్రత ఉండదు.

రోబోలు, ఆటోమేటెడ్ ప్రొగ్రాంల నుంచి ఎలాంటి హానీ జరగకుండా క్యాప్చా రక్షిస్తుంది. క్యాప్చా ప్రక్రియను మనం పూర్తి చేస్తున్న సమయంలో కర్సర్ కదలికలు ఆటోమేటిక్‌గా ట్రాక్ అవుతాయి. మనిషి చేసే కదలికలను సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తుంది. దీని వల్ల మానవుడే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నాడని అంచనా వేస్తుంది. అలాగే వినియోగదారుడి పరికరంలోని బ్రౌజర్ ద్వారా నిల్వచేసిన కుక్కీలతో పాటు ఇంతకుముందు శోధించిన విషయాలను కూడా క్యాప్చా ట్రాక్ చేస్తుంది.

ఇవన్నీ ట్రాక్ చేయడం ద్వారా మనిషే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నాడని, రోబోట్ కాదని కంప్యూటర్‌కు తెలుస్తోంది. దీని వల్ల మన సమచారం సురక్షితంగా ఉంటుంది. అలాగే స్పామ్, పాస్‌వర్డ్ డిక్రిప్షన్, సైబర్ దాడులు, హానికరమైన మాల్‌వేర్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. అందుకే ఆన్‌లైన్‌లో బ్యాంకు లావాదేవీలు నిర్వహించే సమయంలో క్యాప్చా తప్పనిసరిగా ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.