ETV Bharat / science-and-technology
టిక్‌టాక్ ఫీచర్లతో ఇన్‌స్టాగ్రామ్ 'రీల్స్' - ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ టెస్టింగ్
భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించినట్లు ఫేస్‌బుక్ తెలిపింది. టిక్‌టాక్ మాదిరిగా ఇందులో 15 సెకన్లపాటు వీడియోలను చిత్రీకరించి ఎడిట్ చేసుకోవచ్చు.
చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో ఆ వినియోగదారులను ఒడిసిపట్టుకొనేందుకు మిగిలిన టెక్ దిగ్గజాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పరీక్షించడం మొదలుపెట్టినట్లు ఫేస్‌బుక్ బుధవారం అధికారికంగా తెలియజేసింది.
ఇప్పటికే ఈ ఫీచర్‌ను బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్‌లో పరీక్షించారు. దీనిలో వినియోగదారులు 15క్షణాలపాటు మల్టీక్లిప్ వీడియోను చిత్రీకరించడం.. ఎడిట్ చేయడం వంటివి చేయవచ్చు. ఈ వీడియోలను వాళ్ల ఫాలోవర్లకు ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో షేర్ చేయవచ్చు. దీనిలో ఎక్స్‌ప్లోరల్ ఫీచర్ కారణంగా ఎక్కువ మంది ఇన్‌స్టా వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.
‘‘ఇటీవల కాలంలో వీడియో వినియోగం పెరిగిపోయింది. భారత్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ అయ్యే కంటెంట్‌లో మూడోవంతు వీడియోలే. ప్రజల భావాలను వ్యక్తం చేసేందుకు సాయపడటంలో ఇన్‌స్టాగ్రామ్ కీలక పాత్ర పోషిస్తోంది. భారత్‌లోని నలుమూలల నుంచి ప్రజలు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి తమను తాము సురక్షితంగా భావవ్యక్తీకరణ చేయడంతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఆస్వాదించాలి. రోల్స్ రూపంలో మేము ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా శ్రీకారం చుట్టాము. ఇది వ్యక్తుల్లోని సృజనాత్మకతను వెలికి తీస్తుంది. వీటిల్లో వివిధ రకాల ఫార్మాట్లు ఉన్నాయి. మీకు నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు.’’
-అజీత్ మోహాన్, ఫేస్‌బుక్ ఇండియా ఎండీ
రాత్రి 7.30కు..
బుధవారం రాత్రి 7.30 నిమిషాలకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అందుబాటులోకి వస్తుందని సంస్థ పేర్కొంది. దీని కోసం ఇప్పటికే యామీ విర్క్, గిప్పీ గ్రేవాల్, కోమల్ పాండే, అర్జున్ కనూగ్, జాహ్నవీ డస్టే, ఏకేఏ మహాతల్లి, ఇంద్రాణీ బిస్వాస్, కౌషా కపిల, రాధికా భంగీ వంటివారితో కంటెంట్‌ను సిద్ధం చేసినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి- వన్‌ప్లస్ నార్డ్ ఫీచర్స్ లీక్- ధర ఎంతో తెలుసా?