ETV Bharat / science-and-technology

జులైలో స్మార్ట్​ఫోన్ల పండగ- కొత్త మోడళ్ల ఫీచర్స్​ ఇవే...

author img

By

Published : Jul 6, 2020, 6:44 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

జులై నెలలో స్మార్ట్​ఫోన్ కొనుగోలుదారులకు పండగే. ఎందుకంటే.. వన్​ప్లస్, వివో, పోకో సంస్థలు తమ కొత్త ఉత్పత్తులను ఈ నెలలోనే మార్కెట్​లోకి విడుదల చేసే అవకాశం ఉంది. పోకో సంస్థ తన ఎం2 ప్రో సిరీస్​ను జులై 7న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీనితో పాటు మరికొన్ని స్మార్ట్​ఫోన్ల వివరాలు మీకోసం.

Here are smartphones set to launch in India this month. Take a look
జూలైలో స్మార్ట్​ఫోన్ల పండగ- అదిరే ఫీచర్లతో కొత్త మోడళ్లు

లాక్​డౌన్ ఆంక్షలు సడలింపుతో స్మార్ట్​ఫోన్ తయారీదారులు కొత్త ఫోన్ల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అదిరిపోయే ఫీచర్లతో అద్భుతమైన స్మార్ట్​ఫోన్లు త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. వన్​ప్లస్, వివో, పోకో సంస్థలు ఈ నెలలో తమ ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు పరిచయం చేయడానికి సిద్ధమయ్యాయి.

పోకో సంస్థ ఇప్పటికే తన కొత్త ఎం2 ప్రో సిరీస్​ను జులై 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వన్​ప్లస్​ సైతం త్వరలోనే తన నార్డ్ ఫోన్​ను విపణిలో ప్రవేశపెట్టనుంది. వీటితో పాటు మరిన్ని అధునాత స్మార్ట్​ఫోన్లు ఈ నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూసేద్దామా!

వన్​ప్లస్ నార్డ్

వన్​ప్లస్ సంస్థ తయారు చేసిన నార్డ్​ను తొలుత భారత్​లోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది. తేదీ ప్రకటించకపోయినా.. ఇటీవల సంస్థ చేస్తున్న ప్రచారాన్ని బట్టి చూస్తే త్వరలోనే విపణిలోకి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. నార్డ్​ డిజైన్ సహా పలు కీలకమైన వివరాలు అమెజాన్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయి.

Here are smartphones set to launch in India this month. Take a look
వన్​ప్లస్ నార్డ్

ప్రత్యేకతలు

  • 5జీ సపోర్ట్
  • వెనుక వైపు మూడు కెమెరాలు
  • క్వాల్​కమ్ స్నాప్​డ్రాగన్ 765జీ ప్రాసెసర్
  • ముందువైపు పంచ్​హోల్ కెమెరా

పోకో ఎం2 ప్రో

జులై 7న పోకో సంస్థ సరికొత్త 'పోకో ఎం2 ప్రో'ను లాంచ్​ చేయనుంది. శక్తిమంతమైన ఫీచర్లతో గేమింగ్​ కోసం రూపొందించింది. లాంగ్​ లాస్టింగ్ బ్యాటరీని ఇందులో అమర్చినట్లు టీజర్​ను బట్టి తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్ గురించి సంస్థ ఎలాంటి వివరాలు ప్రకటించలేదు.

వివో ఎక్స్​50 సిరీస్

భారత్​లో అందుబాటులోకి రానున్న మరో ఆసక్తికరమైన ఫోన్ వివో ఎక్స్​50 సిరీస్. అధికారికంగా విడుదల తేదీని ప్రకటించకపోయినప్పటికీ.. ఈ నెలలోనే ఫోన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చైనాలో మే నెలలోనే ఎక్స్​50 సిరీస్​ను విడుదల చేసింది వివో.

వివో ఎక్స్​50 సిరీస్​

ఈ సిరీస్​లో ఉండే స్మార్ట్​ఫోన్లు

  • వివో ఎక్స్​50
  • వివో ఎక్స్​50 ప్రో
  • వివో ఎక్స్​50 ప్రో ప్లస్

అయితే భారత్​లో ఈ మూడు ఫోన్లు విడుదల చేస్తుందో లేదో తెలియాల్సి ఉంది.

వివో ఎక్స్​50, ఎక్స్​50 ప్రో ఫీచర్లు

  • 8జీబీ ర్యామ్
  • 256జీబీ వరకు స్టోరేజీ సామర్థ్యం
  • 6.56 అంగుళాల డిస్​ప్లే
  • స్నాప్​ డ్రాగన్ 765జీ ప్రాసెసర్
  • 4,200ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం
  • 90హెచ్​జడ్ రీఫ్రెష్ రేటు

ఈ రెండు ఫోన్లకు ఉన్న ఒకే తేడా ఏంటంటే.. ప్రో వెర్షన్​లో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది.

వివో ఎక్స్​50 ప్రో ప్లస్

  • ఈ మూడు మోడళ్లలో చాలా ఖరీదైనది ఇదే.
  • 12జీబీ ర్యామ్
  • క్వాల్​కమ్ స్నాప్​డ్రాగన్ 865 ప్రాసెసర్
  • వెనకవైపు నాలుగు కెమెరాలు(50ఎంపీ, 32ఎంపీ, 13ఎంపీ, 13ఎంపీ)
  • 120 హెచ్​జడ్ రీఫ్రెష్ రేటు
  • 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్

రియల్​మీ 6ఎస్

ఈ ఫోన్​ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై రియల్​మీ స్పష్టతనివ్వకపోయినా.. ఈ నెలలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రియల్​మీ 6ఐ స్మార్ట్​ఫోన్​నే ఇండియాలో 6ఎస్​గా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మయన్మార్​లో 6ఐ అందుబాటులో ఉంది. ఈ ఫోన్​ తరహాలోనే 6ఎస్​ ఫీచర్లు ఉండనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

రియల్​మీ 6ఐ ఫీచర్ల విషయానికొస్తే..

  • 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ
  • మీడియాటెక్ హీలియో జీ90టీ ఎస్​ఓసీ ప్రాసెసర్
  • 48ఎంపీ వెనక కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 4,300ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ ఫ్లాష్ ఛార్జింగ్
  • 6.5 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్ డిస్​ప్లే
  • 90హెచ్​ జడ్ రీఫ్రెష్ రేటు

శాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్

భారత మార్కెట్లోకి త్వరలోనే శాంసంగ్ తన కొత్త ఫోన్​ను ప్రవేశపెట్టనుంది. 3జీబీ ర్యామ్​తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. ధర రూ.10 వేలలోపు ఉండే అవకాశం ఉంది.

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.