ETV Bharat / science-and-technology

గూగుల్​లో కొవిడ్​ టెస్టింగ్​ ల్యాబ్​ల సమాచారం

కొవిడ్​-19 కు సంబంధించి గూగుల్​లో మరో కొత్త ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. కరోనా వైరస్​కు సంబంధించి గూగుల్​లో వెతికితే.. టెస్టింగ్​ ల్యాబ్​ల సమాచారం కూడా కనిపించనుంది.

author img

By

Published : Jun 12, 2020, 4:42 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

Google to show COVID-19 testing centres on Search, Assistant and Maps
ఇకపై గూగుల్​లో కొవిడ్​ టెస్టింగ్​ ల్యాబ్​ల సమాచారం

సెర్చ్​ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మరో కొత్త ఫీచర్​ను తీసుకువచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సెర్చ్​, అసిస్టెంట్, మ్యాప్స్​లో.. యూజర్లు తమ దగ్గర్లోని కరోనా పరీక్షా కేంద్రాలను తెలుసుకునే వీలు కల్పించింది. ఇందుకోసం భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), మైగొవ్ ప్లాట్​ఫామ్​తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది గూగుల్.

ఫీచర్ విశేషాలు..

  • ఈ ఫీచర్​ ఇంగ్లీష్​ సహా.. తెలుగు, హిందీ, తమిళ్​, మళయాలం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
  • ఎవరైనా గూగుల్​లో కరోనాకు సంబంధించిన సెర్చ్​ చేస్తే.. ఇకపై టెస్టింగ్ ట్యాబ్​ కనిపిస్తుంది.
  • టెస్టింగ్ ట్యాబ్​లో వినియోగదారుడికి సమీపంలోని కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబ్​ల వివరాలు ఉంటాయి.

ప్రస్తుతం 300 పట్టణాల్లో, 700 టెస్ట్​ ల్యాబ్​ల వివరాలు గూగుల్​లో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మిగతా పట్టణాలకు ఈ సేవలను విస్తరించనుంది గూగుల్.

ఇదీ చదవండి: జియో బంపర్​ ఆఫర్- ఇక 'ప్రైమ్'​ ఉచితం

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.