ETV Bharat / science-and-technology

కొత్త స్మార్ట్​ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ ఫీచర్లు ఉంటేనే తీసుకోండి!

Smartphone Buying Tips In Telugu : మారిన కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లకు అలవాటుపడ్డారు. మొబైల్ ధరలు తగ్గడం, టెక్నాలజీ అందుబాటులోకి రావడం లాంటి అనేక అంశాలు స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని విపరీతంగా పెంచాయి. అయితే కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనే వాళ్లు కచ్చితంగా గమనించాల్సిన అంశాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Smartphone Buying Tips In Telugu
Smartphone Buying Tips In Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 9:58 AM IST

Smartphone Buying Tips In Telugu : పండుగలు వచ్చాయంటే స్మార్ట్​ఫోన్ల మీద భారీ ఆఫర్లు వస్తుంటాయి. అమెజాన్, ఫ్లిప్​కార్ట్​తో పాటు పలు ఈ-కామర్స్ వెబ్​సైట్లు స్మార్ట్ ఫోన్ల మీద భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. దీంతో చాలామంది స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటారు. అయితే కొత్త స్మార్ట్ ఫోన్లు కొనాలని చూస్తున్న వాళ్లు ఈ అంశాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

  1. ఆపరేటింగ్ సిస్టం:
    మొబైల్ కొనుగోలు చేసే సమయంలో గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయాల్లో ఒకటి ఆపరేటింగ్ సిస్టం. ప్రస్తుతం మార్కెట్లో ఆండ్రాయిడ్, iOS అనే ఆపరేటింగ్ సిస్టంలతో మొబైళ్లు అందుబాటులో ఉన్నాయి. చాలా వరకు ఫోన్లు ఆండ్రాయిడ్​తో వస్తుండగా, యాపిల్ కంపెనీ ఫోన్లలో iOS ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది. అయితే ఫోన్ తీసుకునే ముందు ఏ ఆపరేటింగ్ సిస్టం అవసరం, అనుకూలం అనే విషయాన్ని గుర్తించాలి. మన అవసరాన్ని బట్టి ఆపరేటింగ్ సిస్టంను ఎంచుకోవాలి.
  2. డిస్‎ప్లే:
    స్మార్ట్ ఫోన్​ను కొనుగోలు చేసే సమయంలో గుర్తించుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం డిస్‎ప్లే. సాధారణంగా 5.5- 6 అంగుళాలు కలిగిన HD మరికొన్ని QHD డిస్​ప్లేలు తీసుకోవడం మంచిది. ఇలాంటి డిస్​ప్లేలు గేమ్స్​ అడుతున్నప్పుడు, వీడియో స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు మీకు మంచి అనుభూతిని ఇస్తాయి.
  3. బ్యాటరీ:
    స్మార్ట్ ఫోన్ ఎంత బాగా ఉన్నా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ లేకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే 3500mAh బ్యాటరీ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవడం ఉత్తమం.
  4. స్టోరేజీ:
    స్మార్ట్​ఫోన్ అంటే కేవలం కాల్స్ కోసమే కాదు, వీడియోలు, ఫోటోలు తీసుకోవడం కోసం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వీటన్నింటిని స్టోర్ చేసుకునే కెపాసిటీ చాలా ముఖ్యం. అవసరాలకు తగ్గట్టుగా 128జీబీ లేదా 256జీబీ స్టోరేజీ ఉండే స్మార్ట్​ఫోన్​ను ఎంచుకోవాలి.
  5. కెమెరా:
    స్మార్ట్ ఫోన్​లో ఎక్కువ మంది పరిగణలోకి తీసుకునే అంశాల్లో కెమెరా కచ్చితంగా ఉంటుంది. ఫొటోలు తీసుకునే వారికి, వీడియో, వ్లాగ్​లు షూట్​ చేసే వారు కెమెరా క్వాలిటీ బాగుండాలనుకుంటారు. అయితే చాలా మంది కెమెరా మెగాపిక్సెల్ ఎంత ఉంది అని మాత్రమే చూస్తారు. కానీ అపెర్చర్, షట్టర్ స్పీడ్, ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటోఫోకస్ వంటి ఫీచర్లు ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. వీలైతే ఈ ఫీచర్లలో అప్డేట్ వెర్షన్​లను ఎంపిక చేసుకోవాలి.
  6. కనెక్టివిటీ:
    స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు యుఎస్​బీ ఇంటర్ ఫేస్, వైఫై కనెక్టివిటీ, లేటెస్ట్​ బ్లూటూత్ వెర్షన్, (జీపీఎస్, గ్లోనాస్, బైడూ, గెలీలియో, QZSS) లొకేషన్ టెక్నాలజీ లాంటి సాంకేతిక పరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

ఫోన్ కొనుగోలు చేసే సమయంలో పైన పేర్కొన్న ఆరు అంశాలను పరిగణలోకి తీసుకొని, అవసరాలకు తగిన వాటిని ఎంచుకోవాలి.

రూ.10 వేలకే ఐఫోన్​.. 89% డిస్కౌంట్​తో స్మార్ట్​ఫోన్స్​..​​ డీల్స్​​ అదుర్స్ గురు​!

Smartphone Security Tips : స్మార్ట్​ఫోన్​ను వాలెట్​లా వాడుతున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.