ETV Bharat / science-and-technology

టిక్​టాక్ తరహా​లో 'యూట్యూబ్ షార్ట్స్'

ప్రముఖ వీడియో ప్లాట్​ఫామ్ యూట్యూబ్ భారత్​లో కొత్త ఫీచర్​ అందుబాటులోకి తెచ్చింది. 'షార్ట్స్' పేరుతో టిక్​టాక్​ తరహా ఫీచర్లను ఇందులో ఉంచింది.

WHAT IS YOUTUBE SHORTS FEATURE
యూట్యూబ్ షార్ట్స్ ఫీచర్
author img

By

Published : Sep 15, 2020, 2:30 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

భారత్​లో టిక్​టాక్ నిషేధం తర్వాత.. దాని మార్కెట్​ను దక్కించుకునేందుకు పెద్ద సంఖ్యలో కొత్త యాప్​లు పుట్టుకొచ్చాయి. ఫేస్​బుక్​కు చెందిన ఇన్​స్టాగ్రామ్​ కూడా రీల్స్ పేరుతో ఓ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రేసులో ఇప్పుడు గూగుల్​కు చెందిన వీడియో ప్లాట్​ఫామ్ యూట్యూబ్​ కూడా చేరింది.

ప్రస్తుతానికి భారత్​లో మాత్రమే..

'షార్ట్స్​' పేరుతో టిక్​టాక్​కు పోటీగా కొత్త బీటా ఫీచర్​ను తీసుకొచ్చింది యూట్యూబ్. భారత్​లో మాత్రమే(ఆండ్రాయిడ్, ఐఓఎస్​ రెండింటికీ) ప్రస్తుతానికి ఈ ఫీచర్​ అందుబాటులో ఉంది. అది కూడా మొబైల్ యాప్​లో మాత్రమే పని చేస్తుంది. రానున్న రోజుల్లో ఇతర దేశాలకు ఈ ఫీచర్​ను విస్తరిస్తామని యూట్యూబ్ వెల్లడించింది.

యూట్యూబ్ షార్ట్ విశేషాలు..

మల్టిపుల్ సెగ్మెంట్ కెమెరా సహా.. వీడియో ఎడిట్ చేసేందుకు కొన్ని టూల్స్ అందుబాటులో ఉంచింది యూట్యూబ్. ఈ ఫీచర్లతో 15 సెకన్లు, అంత కన్నా తక్కువ నిడివి గల వీడియోలను క్రియేట్ చేయొచ్చు. నిలువుగా మాత్రమే వీడియో తీసేందుకు వీలుంది.

మ్యూజిక్​తో వీడియోను రికార్డ్ చేసే సదుపాయం, హ్యాండ్స్​ ఫ్రీ వీడియో చిత్రీకరణకు టైమర్ సహా పలు ఇతర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని అప్​డేట్​లు తీసుకురానున్నట్లు యూట్యూబ్​ వెల్లడించింది.

ఇన్​స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్​కు యూట్యూబ్ షార్ట్స్ గట్టి పోటీ ఇవ్వగలుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:నేడు యాపిల్ ఈవెంట్- మార్కెట్లోకి వచ్చే గాడ్జెట్స్ ఇవే!

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.