ETV Bharat / science-and-technology

కాల్ చేయాలంటే కారణం చెప్పాల్సిందే..! - ట్రూకాలర్ అప్​డేట్​ ఫీచర్లు

కాల్ రీజన్ పేరుతో ట్రూకాలర్ కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా అవతలి వ్యక్తులు ఎందుకు ఫోన్ చేస్తున్నారనేది ముందుగానే తెలుసుకోవచ్చు. దాంతో ఆ కాల్ మాట్లాడాలా వద్దా అని వినియోగదారులు నిర్ణయించుకోవచ్చు. దీని వల్ల యూజర్స్‌కి స్పామ్‌ కాల్స్‌ నుంచి ఊరట లభిస్తుందని ట్రూకాలర్‌ తెలిపింది.

true caller latest news
ట్రూకాలర్ కొత్త ఫీచర్
author img

By

Published : Oct 22, 2020, 10:01 AM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

మార్కెటింగ్ ప్రమోషన్స్‌కి సంబంధించి మనలో చాలా మందికి రోజులో ఒక్కసారయినా ఫోన్లు వస్తుంటాయి. అవసరంలేదని ఎన్ని సార్లు చెప్పినా పదే పదే ఫోన్‌ చేసి విసిగిస్తుంటారు. ఒక వేళ నంబర్‌ బ్లాక్ చేసినా మరో కొత్త నంబర్‌ నుంచి ఫోన్ చేస్తుంటారు. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ ట్రూకాలర్‌ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కాల్‌ రీజన్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో అవతలి వ్యక్తులు ఏ పనిమీద మనకు ఫోన్ చేస్తున్నారనేది ముందుగానే తెలుసుకోవచ్చు. ఇప్పటికే ట్రూకాలర్‌ యాప్‌తో కొత్త నంబర్‌ నుంచి ఫోన్ వస్తే కాలర్‌ ఐడీ ఫీచర్‌తో ఎవరనేది చాలా వరకు తెలిసిపోతుంది.

true caller latest news
ట్రూకాలర్ కొత్త ఫీచర్

తాజాగా తీసుకొస్తున్న కాల్ రీజన్‌ ఫీచర్‌తో అవతలి వారు ఎందుకు ఫోన్ చేస్తున్నారనేది ఇట్టే తెలిసిపోతుంది. ఉదాహరణకు మీరు క్రెడిట్ కార్డ్‌ బిల్లు చెల్లించాలని బ్యాంక్‌ వాళ్లు ఫోన్‌ చేస్తుంటే మీకు నంబర్‌తో పాటే ఫోన్‌ స్క్రీన్‌ మీద కాల్‌ రీజన్‌లో బిల్లు చెల్లింపుల గురించి అనే మెసేజ్‌ కనిపిస్తుంది. అలానే ఎవరైనా మీకు ఏదైనా ఉత్పత్తి అమ్మడం కోసం ఫోన్‌ చేస్తుంటే రీజన్‌లో మీకు ప్రొడక్ట్‌ సేల్‌ కోసం అని మెసేజ్‌ కనిపిస్తుంది. దాంతో మీరు ఆ కాల్ మాట్లాడాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. దీని వల్ల యూజర్స్‌కి స్పామ్‌ కాల్స్‌ నుంచి ఊరట లభిస్తుందని ట్రూకాలర్‌ తెలిపింది.

true caller latest news
ట్రూకాలర్ కొత్త ఫీచర్

ఎలా పనిచేస్తుందంటే..?

ఈ ఫీచర్‌లో పర్సనల్‌, బిజినెస్‌, అర్జంట్‌ అని మూడు ఆప్షన్స్‌ ఉంటాయి. మీరు అవతలి వ్యక్తులకు ఫోన్ చేసే ప్రతిసారీ వీటిలో ఒక దాన్ని ఎంచుకోవాలి. ఒక వేళ ఈ మూడు కాకుండా మీరు వేరే కారణంతో ఫోన్‌ చేస్తుంటే రీజన్ బాక్స్‌లో దాన్ని ఎంటర్‌ చేయాలి. అలా మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారనేది అవతలి వ్యక్తులకు తెలుస్తుంది. ఒక వేళ ఈ ఫీచర్ మీకు అవసరం లేదనుకుంటే సెట్టింగ్స్‌లోకి దాన్ని డిజేబుల్‌ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఐఓఎస్‌ యూజర్స్‌కి దీన్ని అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం.

దీనితో పాటు ట్రూకాలర్‌ ఆండ్రాయిడ్ యూజర్స్‌ కోసం ఎస్సెమ్మెస్‌ షెడ్యూలింగ్, ఎస్సెమ్మెస్ ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌ని పరిచయం చేసింది. షెడ్యూల్‌ ఎస్సెమ్మెస్ ఫీచర్‌తో యూజర్స్‌ మెసేజ్‌లను అనుకున్న సమయానికి పంపేలా షెడ్యూల్ చెయ్యొచ్చు. అలానే ఈవెంట్స్‌, సమావేశాలు, నిత్యావసరాల షాపింగ్‌కు సంబంధించి రిమైండర్‌ సెట్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌తో ఇతర భాషల్లో మనకు వచ్చే మెసేజ్‌లను ట్రాకాలర్ గుర్తించి ట్రాన్స్‌లేట్‌ చేస్తుంది. 8 భారతీయ భాషలతో కలిపి ప్రపంచంలోని 59 భాషలను ట్రూకాలర్‌ సపోర్ట్ చేస్తుంది. గూగుల్ మెషీన్ లెర్నింగ్‌ ఆధారంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. ట్రాన్స్‌లేషన్ ప్రారంభమవడానికి ముందే ట్రూకాలర్‌ లాంగ్వేజ్‌ ప్యాక్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. ఒక వేళ యూజర్‌ ప్యాకేజ్‌లోని భాషలకు కాకుండా ఇతర భాషలు కావాలనుకుంటే వాటిని కూడా డౌన్‌లోడ్ చేసుకుని ప్యాకేజ్‌కి యాడ్ చేసుకోవచ్చు.

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.