ETV Bharat / science-and-technology

చంద్రుడికి కూడా తుప్పు పడుతుందా..?

author img

By

Published : Sep 13, 2020, 5:25 AM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

చందమామలో పెదరాశి పెద్దమ్మ. రాట్నంపై నూలు వడుకుతుంటుంది. నిండు వెన్నెల్లో నల్లగా కనిపించే ఆ ప్రదేశం.. ఆ ముసలవ్వదే. బాల్యం నుంచి వింటున్న తెలుగు జానపద కథ ఇది. కానీ, భవిష్యత్‌ తరాలు.. చంద్రయాన్‌ వల్ల చంద్రుడి గురించి కొత్త కథలు-కథనాలు విననున్నాయి. చంద్రుడికైనా లేదా మచ్చ... అని తెలుగు సినిమా పాటలో ఉన్నట్లు... ఇప్పుడు చంద్రుడికి తుప్పు కూడా పడుతోందని తేలింది. భూమి, మార్స్ గ్రహాల మాదిరిగానే చంద్రుడిపై కూడా తుప్పు పడుతుందంటోంది... చంద్రయాన్‌-1. జాబిల్లిపై ప్రయోగాలకై భారత్‌ సంధించిన తొలి మిషన్‌.. కొత్త విషయాలు చెబుతోంది. ఈ పరిశీలనతో శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోన్న చంద్రుడిపై నీరు-ఆక్సిజన్‌.. అనే అంశాలకు కొత్త జవాబులు జోడించింది.

చంద్రుడికి కూడా తుప్పు పడుతుందా..?
చంద్రుడికి కూడా తుప్పు పడుతుందా..?
చంద్రుడికి కూడా తుప్పు పడుతుందా..?

తుప్పు లేదా సిలుము. సాధరణంగా ఇనుముకు వచ్చే ఓ వ్యాధి లాంటిది. ఇనుము చాలా కాలం ఒకే చోట ఉన్నప్పుడు.. నీరు-ఆక్సిజన్‌‌తో చర్య జరిపినప్పుడు ఏర్పడే ఎర్రటి సమ్మేళనం. భూగోళంపై ఇలా ఇనుముకు తప్పు పట్టడం సర్వసాధారణమే. ఇప్పటి వరకూ భూమి, అంగారకుడిపై మాత్రమే వస్తువులకు తుప్పు పట్టడం గురించి తెలుసు.. కానీ, ప్రస్తుతం చంద్రుడిపై కూడా ఉన్నట్టు తాజాగా గుర్తించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చంద్రుడిపై అధ్యయనానికి తొలిసారిగా ప్రయోగించిన చంద్రయాన్-1 ఆర్బిటర్ పంపిన ఫోటోలను పరిశీలించి, దీని ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి వచ్చారు.

భూగ్రహానికి సహజ ఉపగ్రహమైన చంద్రుడు ధ్రువాల వద్ద తుప్పు పడుతున్నట్లు చంద్రయాన్-1 మిషన్ ద్వారా తెలుస్తోంది. ఆర్బిటర్ పంపిన సమాచారాన్ని సమీక్షించి, చంద్రుడి ధ్రువాల వద్ద తుప్పు ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు ఖగోళ శాస్త్రజ్ఞులు. ఇప్పటివరకు చంద్రుడిపై ఇనుము పుష్కలంగా ఉన్న రాళ్లు ఉన్నట్లు తెలిసినా.. వాటిని తుప్పు పట్టించే స్థాయిలో నీరు, ఆక్సిజన్ ఉనికి గురించి తెలీదు. అయితే ఇప్పుడు చంద్రుడి ఉపరితలంపై ధ్రువాల వద్ద తుప్పు పట్ట వచ్చని ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 ఆర్బిటర్ పంపిన ఫోటోలు కొత్త విషయం తెలియ జేస్తున్నాయి.

చంద్రుడిపై అధ్యయనం కోసం తొలిసారి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. మానవ రహిత జాబిల్లి యాత్రగా చంద్రయాన్-1ను 2008లో ప్రయోగించింది. ఈ మిషన్‌లో లూనార్ ఆర్బిటర్, ఇంపాక్టర్ ఉన్నాయి. పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్‌తో ఈ నౌక అంతరిక్షంలోకి వెళ్లింది. ఇందులో సాఫ్ట్, హార్డ్ ఎక్స్-కిరణాల పౌన:పున్యాల వద్ద హై రెజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ పరికరాలు వినియోగించారు. దీని ప్రధాన లక్ష్యం.. భూమినుంచి కనిపించకుండా నీడలో ఉండే ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో ఉన్న ఖనిజాలు, రసాయనాల ఆనవాళ్ల చిత్రీకరణ. చంద్రుడి ధ్రువాలలో ఘనీభవించిన నీరు, మంచు... ఎత్తైన శిలా ప్రదేశాలలో రసాయన చర్యల అవశేషాలను వెదకడం. అలాగే చంద్రుడి పొరల్లోని పైభాగం, అక్కడి లోయల్లో రసాయన స్ట్రాటిగ్రఫీని పరిశోధించడం.

తన పనిలో భాగంగానే చంద్రయాన్‌-1.. చంద్రుడి గురించి ఇది కీలకసమాచారం వెల్లడించింది. చంద్రయాన్-1 పంపిన చిత్రాల ప్రకారం చంద్రుడిధృవాల వద్ద తుప్పు ఏర్పడుతున్నట్లు దేశ అంతరిక్ష శాఖ మంత్రి డా.జితేంద్ర సింగ్‌ సైతం ధృవీకరించారు. ఇలాంటి సమాచారం కోసమే శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఇనుమును తుప్పు పట్టించడానికి నీరు, ఆక్సిజన్‌ కీలకం. ఆక్సిజన్ సమక్షంలో ఇనుమును నీరు తాకినపుడు తుప్పు పుడుతుంది. దీనిని ఐరన్ ఆక్సైడ్ అని కూడా పిలుస్తారు. చంద్రుడి ఉపరితలంపై నీరు, ఆక్సిజన్ ఉనికి తెలియదు కాబట్టి ఇది ఆశ్చర్యకరమైన ఆవిష్కరణే. ఎందుకంటే చంద్రుడిపై జరుగుతున్న ప్రయోగాల నేపథ్యంలో చంద్రుడి ఉపరితలంపై వీటి ఆచూకీ చాలా కీలకం. దీన్ని బట్టి చంద్రుని మీద నీటి ఆనవాళ్లున్నాయనడానికి ఒక ఆధారం దొరికినట్లైందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

చంద్రుడి మీద ఖనిజాల తవ్వకంపై ఎప్పటినుంచో వాదనలు నడుస్తున్నాయి. చంద్రుడి మీద ఖనిజాల తవ్వకాలు చేపట్టి భూమిపైకి తీసుకురావాలని.. ఎంతోమంది కలలు కంటున్నారు. అంతరిక్షంలోకి మరింత దూరం, విభిన్న గ్రహాలకు ప్రయాణించాలని కోరుకుంటున్నారు. ప్రయాణాలకు చందమామ ఒక పెట్రోల్ స్టేషన్‌గా ఉపయోగపడుతుందని.. రాకెట్ ఇంధనానికి అవసరమైన హైడ్రోజన్, ఆక్సిజన్ వంటి వనరులు అక్కడ పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఖనిజాలను తవ్వి తేవటం.. ఎలక్ట్రిక్ కార్ల వంటి వాటి తయారీకి దోహద పడుతుందని, అది దీర్ఘ కాలంలో మన పర్యావరణానికి మేలు చేస్తుందని మరికొంత మంది భావిస్తున్నారు. ఇప్పుడు తాజాగా చంద్రయాన్‌-1 పంపిన సమాచారం.. ఈ కోణంలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడనుంది.

భూమి సాధారణంగా కనిపించే హెమటైట్ వల్లనే తుప్పు ఏర్పడుతుందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చంద్రుడిపై ఆ పరిస్థితులు ఉండవు. అక్కడ నీటి ఆనవాళ్లు గుర్తించినప్పటి నుంచి ఆ నీరు రాళ్లతో ప్రతిచర్య జరిపి ఉంటే ఇప్పటివరకు తెలుసుకున్న దానికంటే ఎక్కువ రకాల ఖనిజాలు ఉండవచ్చని.. భూ వాతావరణం చంద్రుడికి సాయం చేస్తోందని నాసా అభిప్రాయపడుతోంది. అయితే తుప్పు ఏర్పడడానికి సహకరించే వాతావరణం చంద్రుని మీద లేకపోవడంతో శాస్త్రవేత్తలు మరో దిశగా పరిశోధనలు మొదలు పెట్టారు.

ప్రస్తుతం చంద్రయాన్‌-1 పరిశోధన ప్రకారం.. చంద్రుని ధ్రువాలు తుప్పుపట్టడంలో భూమి పాత్ర కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. సూర్యుడి సౌర రేణువులు పెద్దమొత్తంలో చంద్రుని ఉపరితలం మీదకి వస్తాయి. అక్కడ ఎలాంటి వాతావరణం లేని కారణంగా హైడ్రోజన్ విడుదల పెరిగి, తుప్పు ఏర్పడటానికి వీలు కల్పించదు. దాన్ని తాకిన పదార్థాలకు ఎలక్ట్రాన్‌లను జోడించే లక్షణం హైడ్రోజన్‌కు ఉంది. కానీ ఇనుము, తుప్పుగా మారాలంటే ఎలక్ట్రాన్‌లను తొలగించాలి. కానీ ఇక్కడ భూమి తన మాగ్నటోటెయిల్ ప్రభావాన్ని చూపిస్తుంది. మాగ్నటోటెయిల్ ప్రభావం అంటే సూర్యుని వైపుగా విస్తరించి ఉన్న భూఅయస్కాంతక్షేత్రం. పౌర్ణమి రోజున ఇది సూర్యుని నుంచి చంద్రుని మీదకి వచ్చే 99% సౌరరేణువులను నిరోధిస్తుంది. అలాగే అదేరోజున భూమ్మీది ఆక్సిజన్ కొద్దిమొత్తంలో చంద్రుని మీదకు సరఫరా అవుతుంది. ఈ విషయాన్ని 2007లో జపాన్‌కు చెందిన కగుయా ఆర్బిటర్ ధ్రువీకరించింది.

ఇలా సరఫరా అయిన ఆక్సిజన్, అక్కడి హైడ్రోజన్ ప్రభావాన్ని తగ్గించడమే కాక చంద్రుడి ధ్రువాల మీది ఇనుముతో చర్య జరుపుతుంది. అయితే ఈ చర్యకు కావాల్సిన నీరు ధ్రువాల వద్ద మాత్రమే ఉండటంతో కేవలం అక్కడే తుప్పు పడుతోందని నాసా శాస్త్రవేత్తలు వివరించారు. అయినా ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.. చంద్రుని మీద, భూమ్మీద పట్టే తుప్పు రెండూ ఒకే రకంగా ఉంటాయా? లేదంటే చంద్రుని రాళ్లలో రసాయన సమ్మేళనాల వల్ల ఏవైనా మార్పులు ఉంటాయా? అనే విషయాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి: జాబిల్లిని ముద్దాడే వేళ... విక్రమ్​, ప్రజ్ఞాన్​ పరిహాసాలు

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.