రోబోలపై మన అవగాహన రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు కూడా మనుషులకు సహాయం చేసే వినూత్న రోబోల కోసం నిరంతరం కృషి చేస్తున్నాయి. మానవులకు సాయం చేసేందుకు.. బోస్టన్ రోబోటిక్స్ రూపొందించిన రోబో డాగ్ వంటి వాటిని మనం ఇప్పటికే చూశాము. ఇప్పుడు బరువైన వస్తువులను మోయడంలో మనుషులకు సాయం చేసే కొత్త రకం రోబోను తయారు చేసింది మరో సంస్థ.
డిజిట్ అని పిలువబడే ఈ హ్యూమనాయిడ్ రోబో.. ఫ్యాక్టరీల్లో, కార్యాలయాల్లో పెద్ద పెద్ద బాక్సులు, వస్తువులను ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మార్చగలుగుతుంది. ఇతర రోబోలతో పోలిస్తే ఈ రోబో డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఈ రోబోకు అసలు తల ఉండదు.
రోబో కిందివైపు భాగాలను పరిశీలిస్తే.. మోకాళ్ల వద్ద అసాధారణ వంపు ఉంటుంది. ఈ ప్రత్యేకమైన డిజైన్ వల్ల ఆ రోబో బరువైన వస్తువులను చేతులపై పెట్టుకుని ముందుకు నడిచేందుకు ఉపయోగపడుతుంది. దీనివల్లే బరువైన వస్తువులను పట్టుకుని మెట్లపైకి కూడా ఎక్కగలదు ఈ రోబో. కిందకు వంగి బాక్సులను స్వయంగా ఎత్తుకోవడం ఈ రోబో మరో ప్రత్యేకత. ఈ రోబోను ఎజిలిటీ రోబోటిక్స్ అనే సంస్థ రూపొందించింది.
-
We're excited to announce a $20M fundraise co-led by @DCVC and @Playground_VC. With Digit now in full production, we look forward to putting bipedal robots to work in dull, dirty, and dangerous spaces designed for humans. https://t.co/wBmKIrXnhv pic.twitter.com/yDAKRtERtf
— Agility Robotics (@agilityrobotics) October 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">We're excited to announce a $20M fundraise co-led by @DCVC and @Playground_VC. With Digit now in full production, we look forward to putting bipedal robots to work in dull, dirty, and dangerous spaces designed for humans. https://t.co/wBmKIrXnhv pic.twitter.com/yDAKRtERtf
— Agility Robotics (@agilityrobotics) October 15, 2020We're excited to announce a $20M fundraise co-led by @DCVC and @Playground_VC. With Digit now in full production, we look forward to putting bipedal robots to work in dull, dirty, and dangerous spaces designed for humans. https://t.co/wBmKIrXnhv pic.twitter.com/yDAKRtERtf
— Agility Robotics (@agilityrobotics) October 15, 2020
ఇదీ చూడండి:టెక్ సంస్థలపై ఇంత వ్యతిరేకత ఎందుకు?