మిలియన్ల సంఖ్యలో స్మార్ట్ పరికరాలకు హ్యాకింగ్ ప్రమాదం పొంచి ఉందని అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. వాటి సాఫ్ట్‌వేర్‌లో లోపాలు గుర్తించినట్టు పేర్కొంది. ఈ లోపాలను వాడుకుని.. వ్యాపార, ఇంటి కంప్యూటర్ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేసే అవకాశముందని హెచ్చరించింది. అయితే ఇప్పటివరకు అలాంటి ఘటనలేవీ బయటకు రాలేదని తెలిపింది.
ఇంటర్నెట్ అనుసంధాన పరికరాల్లోని డేటా-కమ్యూనికేషన్ సాఫ్ట్వైర్స్లో ఈ ముప్పు ఉందని.. దీనిని వెంటనే పరిష్కరించాలని సైబర్ సెక్యూరిటీస్ సంస్థ ఫోర్స్కౌట్ టెక్నాలజీస్ పరిశోధకులు వెల్లడించారు. స్మార్ట్ థర్మామీటర్లు, స్మార్ట్ ప్లగ్స్, ప్రింటర్ల నుంచి ఆఫీసుల్లోని రూటర్ల వరకు, హెల్త్‌కేర్ అప్లయెన్సెస్ నుంచి పరిశ్రమల నియంత్రణ వ్యవస్థ వరకు అన్నింటిలోనూ ఈ లోపాలున్నాయని వారు రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు.
హ్యాకింగ్ బెడద నుంచి రక్షణాత్మక చర్యలు చేపట్టాలని వినియోగదారులకు పరిశోధకులు సూచించారు. పరిశ్రమల నియంత్రణ వ్యవస్థను అంతర్జాలం నుంచి పూర్తిగా వేరుచేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:- కొవిడ్ తరువాత సాధారణ స్థితికి వుహాన్!