ETV Bharat / science-and-technology

వన్​ప్లస్​ నుంచి బడ్జెట్ 5జీ ఫోన్​- ఫీచర్లు లీక్ - వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 5జీ ధర అంచనాలు

చైనాకు చెందిన వన్​ప్లస్​.. భారత్​లో బడ్జెట్ ధరలో 5జీ స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 10న 'నార్డ్​ సీఈ 5జీ' పేరుతో ఈ మోడల్​ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. విడుదలకు ముందే పలు ఫీచర్లు లీకయ్యాయి. ఆ వివరాలేమిటో మీరు చూసేయండి.

OnePlus Nord CE 5G Price
నార్డ్​ సీఈ 5జీ
author img

By

Published : Jun 7, 2021, 2:52 PM IST

ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ వన్​ప్లస్ భారత్​లో​ బడ్జెట్​ ధరలో 5జీ మోడల్​ను ఆవిష్కరించనుంది. 'నార్డ్​ సీఈ 5జీ' పేరుతో ఈ మోడల్​ను భారత్​తో పాటే ఐరోపా మార్కెట్లలోనూ ఈ నెల 10న విడుదల చేయనుంది. విడుదలకు ముందే కొత్త మోడల్​కు సంబంధించిన పలు ఫీచర్లు, డిజైన్​ను రివీల్​ చేసింది వన్​ప్లస్​.

64 మెగా పిక్సెళ్ల ప్రధాన కెమెరాతో వెనుకవైపు మొత్తం మూడు కెమెరాలు ఉండనున్నట్లు తెలిపింది. ముందు వైపు పంచ్​ హోల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది. 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ, వార్ప్​ ఛార్జింగ్ 30టీ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ మోడల్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇతర ఫీచర్ల అంచనాలు..

  • 6.43 అంగుళాల అమోలోడ్​, ఫుల్ హెచ్​డీ డిస్​ప్లే
  • స్నాప్​డ్రాగన్​ 750జీ ప్రాసెసర్​
  • 16 మెగా పిక్సెళ్ల పంచ్​ హోల్​ సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్​ 11 ఆపరేటింగ్ సిస్టమ్​

6 జీబీ, 8జీబీ, 12 జీబీ ర్యామ్​ వేరియంట్లలో ఈ మోడల్ లభించే అవకాశం ఉంది. వీటి ధర రూ.37,999 నుంచి ప్రారంభం కానున్నట్లు అంచనాలున్నాయి.

ఈ ఫోన్​ను ఈ నెల 11 నుంచి ప్రీ బుకింగ్​ చేసుకోవచ్చు. ప్రీ ఆర్డర్ చేసుకున్న వినియోగదారులకు రూ.2,699 విలువైన ప్రయోజనాలు దక్కనున్నాయి. 16 నుంచి సాధారణ కొనుగోళ్లకు అందుబాటులోకి రానున్నాయి. హెడ్​డీఎఫ్​సీ కార్డ్ ద్వారా జరిపే కొనుగోళ్లకు రూ.1000 వరకు డిస్కౌంట్​ లభించనుంది.

ఇదీ చదవండి:కరెన్సీల్లో అమెరికా డాలరే ప్రామాణికం ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.