ETV Bharat / science-and-technology

పేలిన వన్​ ప్లస్​ కొత్త ఫోన్.. సంస్థ స్పందనేంటంటే?

వన్​ప్లస్​ ఇటీవలే విడుదల చేసిన నార్డ్​ 2 5జీ స్మార్ట్​ఫోన్.. కొన్న ఐదు రోజులకే​ పేలిందంటూ బెంగళూరుకు చెందిన అంకుర్​ అనే వ్యక్తి ఆరోపించారు. తన భార్య హ్యాండ్​బ్యాగ్​లో నుంచి ఒక్కసారిగా పొగలు రావడం వల్ల భయపడ్డట్లు ఆయన ట్వీట్​ చేశారు. దీనిపై వన్​ప్లస్​ అధికారిక ట్విట్టర్​ ఖాతా స్పందించింది.

OnePlus Nord 2 5G Allegedly Explodes Just Days After Purchase
ఫోన్​ కొన్న ఐదు రోజులకే పేలిపోయింది!
author img

By

Published : Aug 3, 2021, 12:19 PM IST

స్మార్ట్​ ఫోన్ పేలుడు వార్తలను ఇటీవలి కాలంలో అప్పడప్పుడు వింటూనే ఉన్నాం. ఛార్జింగ్​ పెట్టే సమయంలోనో.. లేదా ఫోన్​ తయారీలో ఏదైనా లోపాలతో ఇలాంటి పేలుడు సంభవిస్తుందని వినికిడి. అయితే ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఒకటి బెంగళూరులో జరిగింది. మొబైల్​ కొన్న ఐదు రోజులకే ఇలా జరగడం గమనార్హం.

ఏం జరిగిందంటే?

బెంగళూరుకు చెందిన అంకుర్​ శర్మ అనే వ్యక్తి సతీమణి ఇటీవలే వన్​ప్లస్​ నార్డ్​ 2 5జీ స్మార్ట్​ ఫోన్​ కొనుగోలు చేసింది. ఫోన్​ తన బ్యాగ్​లో పెట్టుకొని సైక్లింగ్​కు వెళ్లగా.. అది ఒక్కసారిగా పేలిందని అంకుర్ ట్వీట్​ చేశారు. బ్యాగ్​లో నుంచి పొగలు రావడం వల్ల తన భార్య ప్రమాదానికి గురైందని ఆరోపించారు. దీంతో పాటు పేలిన ఫోన్​ ఫొటోలనూ షేర్​ చేశారు. దీనిపై వన్​ప్లస్​ సపోర్ట్​ అధికారక ట్విట్టర్​ ఖాతా స్పందించింది.

  • Hi Ankur. We are gutted to hear about your experience. We are deeply concerned and want to make it up to you. We request you to connect to us over a direct message so that we can make amends and turn this around for you. https://t.co/Y6rHuMwu8J

    — OnePlus Support (@OnePlus_Support) August 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"హాయ్​ అంకుర్​.. ఫోన్​ పేలిందన్న వార్త పట్ల మేము చింతిస్తున్నాం. మీరు ఈ విషయాన్ని మాకు నేరుగా తెలియజేయండి. మేము మీ స్మార్ట్​ఫోన్​ను రీప్లేస్​ చేస్తాం" అని వన్​ప్లస్​ రీట్వీట్​ చేసింది. అయితే వెంటనే అంకుర్​ తాను చేసిన ట్వీట్​ను తొలగించారు. వన్​ప్లస్​ స్మార్ట్​ ఫోన్​ పేలడం ఇది తొలిసారి కాదు. 2019 జులైలో తొలిసారి వన్​ప్లస్​ స్మార్ట్​ ఫోన్​ పేలింది.

OnePlus Nord 2 5G Allegedly Explodes Just Days After Purchase
పేలిన ఫోన్​

ఇదీ చూడండి.. ఈ నెలలోనే మార్కెట్లోకి నార్డ్​-2 5జీ ఫోన్​- ఫీచర్లు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.