Nokia 105 phone and Nokia 106 Phone : ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నోకియా.. ఇటీవలే రెండు కొత్త మోడళ్ల ఫోన్లను విడుదల చేసింది. నోకియా 105, నోకియా 106 అనే పేర్లతో రెండు ఫోన్లను లాంఛ్ చేసింది. వీటిల్లో ఇన్‌బిల్ట్ UPI 123 PAY ఆప్షన్ ఉండటం వల్ల ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు.
నోకియా 105 ఫీచర్లు..
Nokia 105 Price : ఇది 1000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 12 గంటల వరకు మాట్లాడవచ్చు. స్టాండ్‌బై సమయం 22 రోజులు ఉండటం విశేషం. 4G HD Calling సపోర్ట్ చేస్తుంది. బరువు 78.7 గ్రాములు ఉంటుంది. ధర రూ.1299. చార్ కోల్, సియాన్, ఎరుపు రంగుల్లో ఈ మోడల్ లభిస్తుంది.
నోకియా 106 ఫీచర్లు..
Nokia 106 Price : ఈ ఫోన్ 4జీ సైతం సపోర్ట్ చేయడం విశేషం. ఇది 1450 mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 8 గంటలు టాక్ టైమ్ కాగా.. స్టాండ్ బై సమయం 12 రోజులు. 93 గ్రాముల బరువు ఉంటుంది. ధర.. రూ.2199. నీలం, చార్కోల్ కలర్లలో ఈ మోడల్ లభిస్తుంది.
రెండు ఫోన్లు కూడా 1.8 అంగుళాల QQVGA Display, IP52 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లు కలిగి ఉన్నాయి. Series 30+ ఆపరేటింగ్ సిస్టమ్, వైర్ లెస్ ఎఫ్ఎం, మైక్రో యూఎస్‌బీ పోర్టు, బ్లూటూత్ వెర్షన్ 5, MP3 ప్లేయర్, 3.5 ఎంఎం ఆడియో జాక్, వాయిస్ రికార్డర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 32 జీబీ వరకు స్టోరేజీ పెంచుకోవడానికి వీలుగా మైక్రో ఎస్‌డీ కార్డు వేసుకునే సౌకర్యం ఉంది. ఈ రెండు ఫోన్లను నోకియా అధికారిక వెబ్ సైట్ అయిన www.nokia.com లో కొనుగోలు చేయవచ్చు.
Nokia Company History : ఒకప్పుడు అంతర్జాతీయ మొబైల్ మార్కెట్ రంగాన్ని ఏలిన నోకియా.. మైక్రోసాఫ్ట్‌తో జత కలిసి విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఫోన్లు తయారు చేసి నష్టపోయింది. ఇదే సమయంలో ఇతర కంపెనీలు ఆండ్రాయిడ్‌తో పనిచేసే ఫోన్లు తయారు చేయడం, వాటికి ప్రజాదరణ లభించడం వల్ల వాటి దూకుడును తట్టుకోలేక దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత HMD గ్లోబల్ అనే కంపెనీతో చేతులు కలిపి ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీని ప్రారంభించి తిరిగి రేసులోకి వచ్చింది. కొన్నేళ్లుగా స్మార్ట్ ఫోన్ల నుంచి సాధారణ మొబైళ్లు వరకు అనేక మోడళ్లను రిలీజ్ చేస్తోంది.