ETV Bharat / science-and-technology

ఐఫోన్ 13 సహా ఈ వారం రిలీజ్ కానున్న మొబైల్స్ ఇవే! - షియోమీ

లేటెస్ట్​ స్మార్ట్​ఫోన్​లు, ల్యాప్​టాప్​లు కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు శుభవార్తే. యాపిల్ ఐఫోన్ 13 సిరీస్​తో పాటు అత్యాధునిక ఫీచర్లతో టెక్నో, ఎంఐ సరికొత్త స్మార్ట్​ఫోన్​లు ఈ వారమే లాంచ్​ కానున్నాయి. వాటి ఫీచర్లు, ఇతర వివరాలపై ఓ లుక్కేయండి.

phones releasing this week
iphone 13
author img

By

Published : Sep 12, 2021, 2:18 PM IST

మొబైల్స్ అంటే విపరీతమైన ఆసక్తి ఉన్నవారికి ఈ వారం బోలెడన్ని విశేషాలు ఉన్నాయి. ప్రత్యేకించి యాపిల్ అభిమానులకు. ఈ అమెరికా సంస్థ అనేక ఉత్పత్తులను లాంచ్ చేసే అవకాశం ఉంది. షియోమీ, హువాయి లాంటి సంస్థలు కూడా తమ కొత్త ఫోన్​లను ఈ వారమే విడుదల చేయనున్నాయి. వాటి విశేషాలేంటో చూడండి.

టెక్నో స్పార్క్ 8- సెప్టెంబర్ 13

phones releasing this week
టెక్నో స్పార్క్ 8

చైనా సంస్థ ట్రాన్షన్ హోల్డింగ్స్​కు చెందిన బ్రాండ్ టెక్నో.. ఈ వారం స్పార్క్ 8 స్మార్ట్​ఫోన్​ను విడుదల చేయనుంది. దీని ఎంట్రీ లెవెల్ ఫోన్​ను ఇప్పటికే నైజీరియాలో లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్​ 11 గోతో రానున్న ఈ ఫోన్​ ఫీచర్లు అత్యాధునికంగా ఉన్నాయి.

ఇన్ఫినిక్స్ జీరో ఎక్స్- సెప్టెంబర్ 13

phones releasing this week
ఇన్ఫీనిక్స్ జీరో ఎక్స్

ట్రాన్షన్​ హోల్డింగ్స్​కే చెందిన మరో బ్రాండ్ ఇన్ఫినిక్స్.. సెప్టెంబర్​ 13నే కొత్త స్మార్ట్​ ఫోన్​పై ప్రకటన చేయనుంది. హై రిఫ్రెష్ రేట్, పెరిస్కోప్​తో ట్రిపుల్ కెమెరా, హీలియో జీ96 ప్రాసెసర్​తో ఇన్ఫినిక్స్ జీరో ఎక్స్ రానుందని సమాచారం.

హువాయి ఈవెంట్- సెప్టెంబర్​ 13

కంప్యూటర్​కు సంబంధించిన వివిధ ఉత్పత్తులపై చైనాలో సెప్టెంబర్ 13న ప్రకటన చేయనుంది హువాయి. ఈ కార్యక్రమంలో తన తొలి ఆఫీస్​ ప్రింటర్​ గురించి వెల్లడించే అవకాశం ఉంది. ఆల్​ ఇన్ వన్ పీసీ, కొత్త మేట్​బుక్​ పీసీలను కూడా హువాయి ప్రకటించనుందని తెలుస్తోంది.

phones releasing this week
యాపిల్ ఈవెంట్

యాపిల్ ఈవెంట్- సెప్టెంబర్ 14

మంగళవారం రోజున (సెప్టెంబర్​ 14) కొత్త ఉత్పత్తులపై ప్రకటన చేయనుంది టెక్ దిగ్గజం యాపిల్. కొత్త ఐఫోన్ 13 సిరీస్, యాపిల్ వాచ్ 7 సిరీస్, కొత్త ఐప్యాడ్​లు, మ్యాక్​బుక్​లను విడుదల చేయబోతుందని సమాచారం.

ఈ కార్యక్రమంలో కొత్త ఐఫోన్​ల గురించిన ప్రకటన హైలైట్​గా నిలవనుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​, అధిక సామర్థ్యం గల బ్యాటరీ, స్మాలర్ నాచ్, పవర్​ఫుల్​ ప్రాసెసర్​తో ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లు రానున్నాయి.

షియోమీ ఈవెంట్- సెప్టెంబర్ 15

phones releasing this week
షియోమీ ఈవెంట్

బుధవారం (సెప్టెంబర్ 15) నాడు తన కొత్త ఉత్పత్తులపై ప్రకటన కోసం గ్లోబల్ ఈవెంట్ నిర్వహించనుంది షియోమీ. అందులో షియోమీ 11టీ/ ఎంఐ 11టీ సిరీస్​లు సహా, ఎంఐ ప్యాడ్ 5ని విడుదల చేస్తుందని సమాచారం. వీటితో పాటు మరికొన్ని ఉత్పత్తులను లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్ 11ఎస్- సెప్టెంబర్ 17

phones releasing this week
ఇన్ఫీనిక్స్ హాట్ 11ఎస్

భారత్​ ఆవల ఇన్ఫినిక్స్​ మరో ఉత్పత్తిని విడుదల చేయనుంది. అదే హాట్ 11ఎస్. హీలియో జీ88 ప్రాసెసర్​తో వచ్చే ఈ స్మార్ట్​ఫోన్​లో నాలుగు కెమెరాలుంటాయి. ఇతర ఫీచర్లు అంతగా ఆకట్టుకోనప్పటికీ, ఆకర్షించే డిజైన్​తో ఈ ఫోన్​ మార్కెట్​లోకి రానుంది.

ఇదీ చూడండి: iphone 13: ఐఫోన్-13 ఫీచర్స్​ లీక్.. మాములుగా లేవుగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.