ETV Bharat / science-and-technology

'కొత్త నిబంధనలతో చిన్న కంపెనీలకు ఆర్థిక భారం'

author img

By

Published : Feb 28, 2021, 6:49 PM IST

కేంద్రం తీసుకొచ్చిన నూతన నిబంధనలపై సామాజిక మాధ్యమ, ఓటీటీ పరిశ్రమ వర్గాలు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. కొత్త నిబంధనలతో పలు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ఓ వర్గం చెబుతుంటే.. వీటి వల్ల ఖర్చులు పెరుగాతాయని మరోవర్గం వాదిస్తోంది.

Social media firms on new rules
కొత్త నిబంధనలపై సామాజిక మాధ్యమాల స్పందన

సామాజిక మాధ్యమాలు, ఓటీటీలకు కేంద్రం తీసుకొచ్చిన నూతన నిబంధనలను అమలు చేయడం వల్ల ఖర్చులు పెరుగుతాయని ఆయా పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫేస్​బుక్​ లాంటి దిగ్గజ సంస్థలతో పోలిస్తే చిన్న కంపెనీలకు ఇది కష్టతరమవుతుందని చెబుతున్నాయి.

కొత్త నిబంధనల ప్రకారం.. సామాజిక మాధ్యమ, ఓటీటీ సంస్థలు చీఫ్ కంపైలెన్స్ ఆఫీసర్​, నోడల్​, రెసిడెంట్​ గ్రీవెన్స్ అధికారులను నియమించాలి. ఈ ముగ్గురు అధికారులు భారత్​ నుంచే కార్యకలాపాలు జరపాలి. అభ్యంతకర పోస్టులపైన వారు తీసుకున్న చర్యల గురించి ప్రతి నెలా కేంద్రానికి నివేదిక అందించాలి. ఈ నిబంధనలన్నీ 50లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ వినియోగదారులు ఉన్న సంస్థలకే వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

ఫేస్​బుక్​ లాంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఈ నిబంధనలను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపాయి.

మిశ్రమ అభిప్రాయాలు..

కొత్త నిబంధనలపై పరిశ్రమ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఫిర్యాదుల పరిష్కారం, నకిలీ వార్తలు, యూజర్ల ఆన్​లైన్ భద్రతకు వీటితో పరిష్కారం లభిస్తుందని కొందరు చెబుతున్నారు. మరికొంత మంది మాత్రం కొత్త నిబంధనల వల్ల చిన్న సంస్థలకు ఖర్చులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాస్కామ్ ఏమందంటే..

ఈ అంశంపై 'నాస్కామ్​' కూడా స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా వేగవంతంగా సాంకేతిక మార్పులు జరుగుతున్నందున నియంత్రణ, ఆవిష్కరణల మధ్య సమతుల్యత అవసరమని అభిప్రాయపడింది.

దేశంలో వివిధ సామాజిక మాధ్యమాల యూజర్లు..

ప్రభుత్వ లెక్కల ప్రకారం.. దేశంలో వాట్సాప్ యూజర్లు 53 కోట్లు, యూట్యూబ్​ యూజర్లు 44.8 కోట్లు, ఫేస్​బుక్ యూజర్లు 41 కోట్లు, 21 కోట్ల ఇన్​స్టాగ్రామ్ యూజర్లు, 1.75 కోట్ల ట్విట్టర్​ యూజర్లు ఉన్నారు. టెలిగ్రాం, సిగ్నల్ వంటి సంస్థలు భారతీయ యూజర్లు ఎంతమంది అనే విషయంపై ప్రకటన చేయలేదు. వాట్సాప్ నూతన పాలసీ నిబంధనలతో ఈ రెండు ప్రధాన ప్రత్యామ్నాయాలుగా మారాయి. దీనితో కొన్ని రోజులుగా వీటి డౌన్​లోడ్​లు విపరీతంగా పెరిగాయి.

ఇదీ చదవండి:ఆ నిబంధన కొత్తది కాదు- కేంద్రం వివరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.