Most Subscribed Youtube Channel : అమెరికాకు చెందిన మిస్టర్ బీస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన వ్యక్తిగత ఖాతాగా రికార్డు సాధించింది. 2013 నుంచి అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన ప్యూడీపైని అధిగమించింది మిస్టర్ బీస్ట్. ఈ యూట్యూబ్ ఛానల్‌ను జిమ్మి డొనాల్డ్సన్ అనే వ్యక్తి రూపొందించగా.. ప్యూడీపైని ఫెలిక్స్ జెల్బర్గ్ అనే వ్యక్తి క్రియేట్ చేశారు. ప్యూడీపైకి 1,11,848,000 మంది సబ్స్క్రైబర్లు ఉండగా.. మిస్టర్ బీస్ట్ 1,11,961,000 సబ్స్క్రైబర్లను సంపాందించింది. ఈ ఛానల్లో వీడియో గేమ్ప్లేస్తో పాటు వివిధ రకాల స్టంట్ వీడియోలను పోస్ట్ చేస్తారు. నాలుగు నెలల క్రితం యూట్యూబ్ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్యూడీపై ప్రకటించడం వల్ల ఆయన ఖాతాదారుల సంఖ్య తగ్గిపోయింది. మరోవైపు అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన యూట్యూబ్ ఛానల్‌గా టీ సిరీస్ కొనసాగుతోంది. టీ సిరీస్ ఛానల్‌కు ప్రస్తుతం 229 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు.
అత్యధిక సబ్స్క్రైబర్లు గల ఛానళ్లు
ఛానల్ | సబ్స్క్రైబర్లు | రంగం | దేశం |
టీ సిరీస్ | 229 మిలియన్స్ | సంగీతం | భారత్ |
కొకొమెలన్ | 147 మిలియన్స్ | విద్య | అమెరికా |
సెట్ ఇండియా | 146 మిలియన్స్ | వినోదం | భారత్ |
మిస్టర్ బీస్ట్ | 112 మిలియన్స్ | వినోదం | అమెరికా |
ప్యూడీపై | 111 మిలియన్స్ | వినోదం | స్వీడన్ |
ఇవీ చదవండి: నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లిన నాసా మూన్ రాకెట్
ఇకపై ఒకే నెంబర్‌తో రెండు వాట్సాప్‌లు.. 256కి మించితే ఆటో మ్యూట్..