ETV Bharat / science-and-technology

ఈ విషయాల గురించి మెసేజ్ చేయకపోవడమే ఉత్తమం.. - messages that should not send through mobiles

'నువ్వున్న కిటికీ ఏవైపో వెతికీ వాట్సాప్ చేస్తావా?? మబ్బుల్ని కదిపి.. మొహమాట పెట్టి చంద్రున్ని తెస్తాగా..' అంటూ తన ప్రియురాలిపై ఉన్న ప్రేమని పాటరూపంలో వ్యక్తం చేశాడు ఓ సినీకవి. ఆయనే కాదు.. ఈరోజుల్లో సందేశం ఏదైనా సరే.. చాలావరకు ఫోన్ ద్వారానే ఒకరి నుంచి మరొకరికి చేరడం కామనైపోయింది. అందుకే సెల్ మోగిన ప్రతిసారీ గుండెలో గంటలు కొట్టుకుంటూ ఉంటాయి. అయితే అన్ని విషయాలనూ ఇలా టెక్ట్స్ రూపంలో పంపించడం అంత మంచిది కాదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. కొన్ని విషయాలకు సంబంధించినంత వరకు అసలు మెసేజ్ చేయకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ విషయాలేంటంటే?

don't text about these, don't text about these matters
మెసేజ్​, ఈ మెసేజ్​లు చేయొద్దు
author img

By

Published : Apr 20, 2021, 11:06 AM IST

ఈ రోజుల్లో సందేశం ఏదైనా అది ఒకరి నుంచి మరొకరికి ఎక్కువగా చేరేది మెసేజెస్ రూపంలోనే! స్మార్ట్‌ఫోన్స్ పుణ్యమా అని యావత్ ప్రపంచమే అరచేతిలో ఇమిడిపోతోన్న ప్రస్తుత కాలంలో చాలామంది సంభాషించేందుకు కూడా దీనినే వేదికగా మలుచుకుంటున్నారు. ఒకప్పుడు ఎలాంటి విషయమైనా నేరుగా సంప్రదించి మాట్లాడేవారు.. ఆ తర్వాత ఫోన్స్ రావడంతో మరీ ముఖ్యమైన సందేశాలకు తప్ప వ్యక్తిగతంగా కలిసి సమాచారం పంచుకోవడం చాలా వరకు తగ్గించేశారు. ఇక ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయం మెసేజ్ చేయడం ద్వారా ఉత్తర, ప్రత్యుత్తరాలతో అక్కడే సంభాషణ ముగిసిపోతోంది. అయితే ఫోన్‌లో ఇలా అన్ని విషయాల గురించీ టెక్ట్స్ రూపంలో మాట్లాడుకోవడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని అంశాలకు సంబంధించి టెక్ట్స్ చేయకపోవడమే శ్రేయస్కరమని సూచిస్తున్నారు.

textmessage650.jpg
దాని గురించి వద్దే వద్దు..!

దాని గురించి వద్దే వద్దు..!

అసభ్యకరంగా లేదా అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలు, సందేశాలతో పాటు లైంగిక చర్యకు సంబంధించిన అంశాలను కూడా మెసేజెస్ ద్వారా పంచుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా సెక్స్‌కు సంబంధించిన విషయాల గురించి టెక్ట్స్ చేయకపోవడమే ఉత్తమం. ఇలాంటి అంశాలను మెసేజెస్‌లో ప్రస్తావించడం వల్ల అనుకోకుండా ఫోన్ పోగొట్టుకున్నా లేదా అందులో ఉన్న ఫొటోలు/ వీడియోలు హ్యాకింగ్‌కు గురైనా ఆ సమాచారాన్ని ఇతరులు దుర్వినియోగపరుచుకునే వీలు ఉంటుంది. ఫలితంగా అనేక ఇబ్బందులు సైతం ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే ఇలాంటి అంశాలకు సంబంధించి ఏవైనా మాట్లాడాలనుకున్నప్పుడు సంబంధిత వ్యక్తిని నేరుగా కలిసి మాట్లాడడమే ఉత్తమం. తద్వారా మీ మనోభావాలను వారికి స్పష్టంగా తెలియజేయడంతో పాటు ఎలాంటి అపార్థాలకూ తావీయకుండా ఉన్నవారు అవుతారు.

వ్యక్తిగతమైన సమాచారం..

'నీ బ్యాంక్ అకౌంట్ పాస్‌వర్డ్ చెప్పవూ..!'

'నీ ఏటిఎమ్ కార్డ్ పిన్ నెంబర్ చెప్పు..' అంటూ స్నేహితుల్లో ఎవరో ఒకరు.. ఎప్పుడో ఒకప్పుడు అడిగే ఉంటారు. తెలిసినవారు, నమ్మకస్తులే కదాని పాస్‌వర్డ్స్, పిన్ నెంబర్స్ వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకున్నారా? అంతే సంగతులు! ఈ సమాచారం ఇతరులకు లేదా హ్యాకర్ల వద్దకు చేరినప్పుడు మీ అకౌంట్లలోని డబ్బుకు రెక్కలు రావడం ఖాయం. అందుకే ఇలాంటి సమాచారాన్ని కూడా టెక్ట్స్ రూపంలో పంచుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ మరీ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే నేరుగా వెళ్లి వారికి సహాయం చేయడం, డిజిటల్ అకౌంట్స్ పాస్‌వర్డ్స్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండడం మంచిది.

textmessage650-1.jpg
విడిపోతున్నారా??

విడిపోతున్నారా??

బ్రేకప్.. అబ్బాయికి అమ్మాయి నచ్చకపోయినా.. అమ్మాయికి అబ్బాయి నచ్చకపోయినా లేదా వారిద్దరి మధ్యా చిన్న మనస్పర్థలు తలెత్తినా ప్రస్తుతం ప్రతి జంట పలికే మొదటి మాట ఇది! అయితే ఒక బంధంలోకి అడుగుపెట్టే ముందు సదరు వ్యక్తికి మన జీవితంలో ఎంత ప్రాముఖ్యం ఇస్తామో అలాగే బ్రేకప్ చెప్పే సమయంలోనూ వారికి అంతే ప్రాముఖ్యం ఇవ్వాలి. ముఖ్యంగా ఆ బంధం నుంచి ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నామో తగిన కారణాలు చెబుతూ ఎదుటివారి మనసు తీవ్రంగా నొచ్చుకోకుండా మెల్లగా అర్థమయ్యేలా చెప్పాలి. అంతేకానీ.. 'నేను నిన్ను ఇకపై ప్రేమించలేను.. నీతో ప్రేమబంధాన్ని కొనసాగించలేను..' అంటూ ఒక మెసేజ్ పంపి అర్ధాంతరంగా ఆ బంధం నుంచి తప్పుకోవడం సరికాదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.

పని ప్రదేశంలో సమస్యల గురించి..

పని ప్రదేశంలో ప్రతిఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే వాటి గురించి సంబంధిత వ్యక్తులతో లేదా నిపుణులతో మాట్లాడి పరిష్కార మార్గాలు అన్వేషించుకోవాలి. అంతేకానీ.. ఆ సమస్యల గురించి సందేశాల రూపంలో స్నేహితుల ముందు ఏకరువు పెట్టడం అస్సలు మంచిది కాదు. వాట్సాప్ వంటి వేదికలో ఇలాంటి సమస్యలు పంచుకున్నప్పుడు మీ ఆఫీసులో పని చేసేవారు ఆ గ్రూపులో ఉంటే మీకు తప్పకుండా కొత్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు పంపిన సందేశాలను మీ పై అధికారులకు వారు చూపిస్తే మీకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది? ఆ తర్వాత మీ కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో మీరు వూహించగలరా?? అందుకే ఆఫీసుకు సంబంధించిన సమస్యలు, విషయాల గురించి ఇతరులతో టెక్ట్స్ రూపంలో షేర్ చేసుకోకపోవడం మంచిది.

ఈ అంశాల గురించి కూడా..

  • ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు..
  • ఇతరులకు సంబంధించిన బాధ కలిగించే విషయాలు..
  • వదంతుల గురించి..
  • మొట్టమొదటిసారి మీ ప్రేమను వ్యక్తం చేయడం..
  • మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు..
  • వాగ్వాదానికి తెరతీసే అంశాలు..
  • ఇతరుల ప్రవర్తన లేదా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం..
  • ఇతరులను కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం..

అపార్థాలకు తావిచ్చే అభిప్రాయాలను పంచుకోవడం.. మొదలైన అంశాల గురించి టెక్ట్స్ రూపంలో ఇతరులకు మెసేజ్ చేయకపోవడం మంచిది. అలాగే ఎవరికైనా క్షమాపణలు తెలియజేయాలన్నా, ఏవైనా శుభవార్తలు చెప్పాలన్నా.. సందేశాల రూపంలో చేరవేయడం కాకుండా వ్యక్తిగతంగా వాళ్లని కలిసి ఆ విషయాలు పంచుకోండి. మీ మధ్య ఉన్న అనుబంధం గాఢత మరింత పెరగడమే కాదు.. మానసికంగా కూడా సంతోషంగా ఉండేందుకు, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.