Complaints on Apple iPhone 15 Series: ఐ-ఫోన్‌కు ఉన్న క్రేజ్ ఏపాటిదో.. మొబైల్ లవర్స్‌ను అడిగితే చెపుతారు. ఆ హ్యాండ్ సెట్‌ను సుతారంగా చేతిలోకి తీసుకోవాలని ఆరాటపడే వారికి అంతే ఉండదంటే నమ్మాల్సిందే. భద్రతా ఫీచర్లకు పెద్దపీట వేస్తూ అధునాతన స్పెసిఫికేషన్స్‌తో వచ్చే యాపిల్ ఫోన్స్‌ను అందరూ ఇష్టపడుతుంటారు. అసలు.. యాపిల్ ఫోన్ చేతిలో ఉండడమే ఓ హోదాగా ఫీలవుతూ ఉంటారు కొందరు!
Apple iPhone 15 Series Full Details in Telugu: ఈ క్రమంలోనే సిరీస్‌ను అప్‌డేట్ చేస్తూ "ఐఫోన్ 15"ను సెప్టెంబర్ 22న మార్కెట్లోకి విడుదల చేశారు నిర్వాహకులు. శుక్రవారం ఉదయం అమ్మకాలు మొదలు పెట్టగా.. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. ఎప్పుడెప్పుడు ఐ ఫోన్ అందుకుందామా.. అని ఎదురు చూశారు. తీరా చేతిలోకి వచ్చిన ఫోన్ చూసి అవాక్కయ్యారు. తమ ఆశలను అడియాసలు చేసిందంటూ ఫీలవుతున్నారు.
Apple iPhone 15 Series Sale : అదిరిపోయే ఆఫర్స్, డిస్కౌంట్స్‌తో.. ఐఫోన్ 15 సిరీస్ సేల్ ప్రారంభం
ఈ ఐఫోన్ 15 సిరీస్.. మన్నిక పరీక్షలో పేలవంగా పని చేసిందని, కలర్ కూడా సరిగా లేదని, ఇంకా ఇతర లోపాలు ఉన్నాయని.. కొనుగోలుదారులు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఎన్నో కలలతో కొత్త ఐఫోన్ కొనుగోలు చేస్తే.. ఆ సంతోషం కాసేపు కూడా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలకు వేలు పోసి కొనుగోలు చేసిన ఫోన్ ఇలా కావడంతో.. ఏం జరుగుతుంది? కంపెనీ ఎలాంటి సమాధానం ఇస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
It appears that some units of the iPhone 15 Pro are defective. The coloring was not applied evenly, furthermore the screen seems not to be perfectly aligned with the edges pic.twitter.com/krzhz4gv4f
— Majin Bu (@MajinBuOfficial) September 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">It appears that some units of the iPhone 15 Pro are defective. The coloring was not applied evenly, furthermore the screen seems not to be perfectly aligned with the edges pic.twitter.com/krzhz4gv4f
— Majin Bu (@MajinBuOfficial) September 22, 2023It appears that some units of the iPhone 15 Pro are defective. The coloring was not applied evenly, furthermore the screen seems not to be perfectly aligned with the edges pic.twitter.com/krzhz4gv4f
— Majin Bu (@MajinBuOfficial) September 22, 2023
- "మొదటి ఐఫోన్ 15 ప్రో డ్రాప్ టెస్ట్ గత సంవత్సరం ఐఫోన్ 14 ప్రో కంటే అధ్వాన్నమైన మన్నికను చూపుతోందట. ఈ కొత్త ఫోన్లో కర్వ్, ఎడ్జెస్.. స్ట్రెయిట్ ఎడ్జ్ డిజైన్ కంటే పెళుసుగా కనిపిస్తున్నాయి" అని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
- కొన్ని సెకన్ల పాటు స్క్రీన్‌పై గీతలు వచ్చాయని మరొకరు కంప్లైంట్ చేశారు.
- "ఐఫోన్ 15 ప్రో కొన్ని యూనిట్లు లోపభూయిష్టంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కలరింగ్ సరిగా లేదు. అంతేకాకుండా స్క్రీన్ అంచులతో సరిగ్గా అలైన్ చేయలేదు" అని మరో యూజర్ X(ట్విటర్)లో షేర్ చేశారు.
- కొన్ని నివేదికలు కొత్త ఫోన్‌ను 'ఫింగర్ ప్రింట్ మాగ్నెట్'గా పేర్కొన్నాయి.
- యాపిల్ కంపెనీ సపోర్ట్.. తన సమాచారంలో ఈ విషయాన్ని పేర్కొంది.
Apple iOS 17 Release : స్టన్నింగ్ ఫీచర్లతో.. iOS 17 రిలీజ్.. అప్‌డేట్ చేసుకోండిలా!