ETV Bharat / science-and-technology

iOS 15: ఐఓఎస్ 15 అదిరే ఫీచర్లపై లుక్కేయండి..

ఐఓఎస్ 15తో (iOS 15) సరికొత్త అప్​డేట్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది యాపిల్. యాప్ ఫాంట్ సైజ్ మార్పు, లైవ్ టెక్ట్స్ కాపీ పేస్ట్, వాయిస్ మెమో అనలైజ్ వంటి ఫీచర్లను (iOS 15 new features) ఇందులో జోడించింది.

ios 15 features list
ఐఓఎస్ ఫీచర్లు
author img

By

Published : Oct 2, 2021, 8:31 AM IST

ఈ మధ్య కాలంలో వరస అప్‌డేట్‌లతో ఐఓఎస్‌ మోత మోగిస్తోంది. సైబర్‌ సెక్యూరిటీతో పాటు నయా ఫీచర్లతో ఐఫోన్ యూజర్లను మరింతగా అలరిస్తోంది. (iOS 15 new features) అందులో భాగంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐఓఎస్‌ 15 గురించే వారం రోజులుగా చర్చంతా!

తాజా అప్​డేట్​లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఫీచర్‌ (iOS 15 new features).. యాప్ ఫాంట్‌ సైజ్‌ మార్పు. రెగ్యూలర్‌గా వినియోగించే యాప్స్‌ ఒక ఫాంట్‌లో.. అప్పుడప్పుడు వినియోగించే యాప్స్ మరో రకమైన ఫాంట్‌లో పెట్టుకోవచ్చు. (iOS 15 apple) తద్వారా యాప్‌లను సులువుగా గుర్తించవచ్చు. ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 7 అనే తేడా లేదు. ఈ సదుపాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఫోన్‌లకు వర్తిస్తుందని (iOS 15 supported devices) ఆ సంస్థ వెల్లడించింది.

లైవ్ టెక్ట్స్ కాపీ పేస్ట్

ఐఓఎస్ 15లో యాపిల్ తెచ్చిన మరో కీలక ఫీచర్.. లైవ్ టెక్ట్స్, కాపీ, పేస్ట్. (Live text iOS 15) ఆండ్రాయిడ్‌ గూగుల్‌ లెన్స్‌ పని చేసినట్లు.. యాపిల్‌లో ఈ ఫీచర్‌ పని చేస్తుంది. ఫొటో తీస్తుంటే.. అందులోని అక్షరాలు పైన కనిపిస్తుంటాయి. వాటిని మనం కావాలంటే కాపీ చేసుకోవచ్చు. అదే సమయంలో కోరిన చోట పేస్ట్ చేసుకోవచ్చు. ఫోన్ మాట్లాడుతూ కూడా ఈ ఫీచర్‌ ఉపయోగించవచ్చు. (Live text iOS 15 how to use) దీనిని పొందడానికి సెట్టింగ్స్ లోకి వెళ్లి జనరల్. ఆ తరువాత లాంగ్వేజ్ & రీజియన్‌ అండ్‌ ఎనేబుల్ లైవ్ టెక్ట్స్ ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ ఐఫోన్ XS, XR, IOS15తో వచ్చే ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది.

iOS 15
ఐఓఎస్ 15

యాప్‌ యాక్టివిటీ రికార్డ్‌...!

యాపిల్ మొదటి నుంచి కూడా యూజర్ ప్రైవసీకి పెద్దపీట వేస్తోంది. (iOS 15 activity) కొత్తగా వచ్చిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో యాప్‌ యాక్టివిటిని మానిటర్ చేసే వీలు కల్పిస్తోంది. దీంతో యూజర్‌కు సంబంధించిన లొకేషన్, ఫొటోలు, కెమెరా, మైక్రోఫోన్ లాంటి ఇతర యాప్‌లు దీనితో కనెక్ట్ అయ్యి ఉంటాయి.

అడ్రస్ బార్ ఎక్కడైనా..

ఐఓఎస్ 15కు సంబంధించి వచ్చిన మరో ముఖ్యమైన ఫీచర్ సఫారీ అడ్రస్ బార్ ప్లేస్‌మెంట్‌. (safari iOS 15) ఈ ఫీచర్‌తో సఫారీలో అడ్రస్ బార్‌ ఎక్కడైనా ఉంచుకోవచ్చు. ప్రస్తుతానికి కింద ఉన్న దీనిని పైకి లేక పక్కకు జరుపుకోవచ్చు. ఇందుకోసం ముందుగా సఫారీలో వెళ్లాలి. తరువాత ఏదైనా వెబ్‌సైట్‌కి ఎంటర్‌ కావాలి. అడ్రస్‌ బార్‌ పక్కనున్న ఏఏ బటన్‌ పైన క్లిక్‌ చేయాలి. అలాగే, యూజర్లు తమ ఐపీ అడ్రస్ హైడ్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. తద్వారా నకిలీ వెబ్‌సైట్లులోకి ఎంటరైనా మీ ఐపీ అడ్రస్ వాళ్లు సులువుగా గుర్తించలేరు.

వాయిస్ మెమో అనలైజ్

యాపిల్‌లో రికార్డ్ చేసిన వాయిస్ మెమోలను (iOS 15 voice memo) ఐఓఎస్ 15 సాయంతో కావాలంటే స్పీడ్‌గా కానీ స్లోగా కానీ వినగలుగుతాం. దీంతో వాయిస్ మెమోలు అనలైజ్ చేయవచ్చు. అలాగే వాటి మధ్యలో వచ్చే నిశ్శబ్దాన్ని కూడా కవర్ చేయవచ్చు. అలాగే, యాపిల్‌ మ్యాప్స్‌లో త్రీడీ ల్యాండ్‌ మార్కింగ్‌ ఫీచర్ అందిస్తోంది.

iOS 15
ఐఓఎస్ 15

ఫోన్లలో స్టోరేజీ..

మరోవైపు, స్మార్ట్‌ఫోన్ల స్టోరేజీలో కొత్తశకం మొదలైంది. త్వరలో 64జీబీకి కాలం చెల్లిపోయి, టెరాబైట్‌ యుగం ఆరంభం కానుంది. ఇటీవలే యాపిల్‌ సంస్థ టీబీ వరకు స్టోరేజీతో కూడిన ఐఫోన్‌13 ప్రొ మోడళ్లు ప్రకటించింది. దీంతో 64జీబీ అంతానికి నాంది పలికినట్టయ్యిందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. నిజానికి టెరాబైట్‌ మార్పునకు సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌10 ప్లస్‌తోనే పునాది పడినప్పటికీ.. ట్రెండ్‌ను సెట్‌ చేసేది మాత్రం యాపిలే.

పెరిగిపోతున్న యాప్‌ అప్‌డేట్లు, రాఫిక్స్‌తో కూడిన గేమ్స్‌ వంటివి ఇట్టే 1జీబీ వరకు స్పేస్‌ తీసేసుకుంటున్నాయి. మరి 64 జీబీ స్టోరేజీ ఎక్కడ సరిపోతుంది. ఒకప్పుడు 16జీబీ అంటేనే ఎక్కువ స్టోరేజీ కింద లెక్క. యాపిల్‌ 2016లో 32జీబీతో ఐఫోన్‌ 7 తీసుకొచ్చిన వెంటనే 16జీబీకి కాలం చెల్లినట్టయ్యింది. అనంతరం స్టోరేజీ 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ.. ఇలా పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఇది టీబీకీ ఎగబాకింది. వీటన్నింటిని పరిగణన లోనికి తీసుకుంటే..128 జీబీ కన్నా తక్కువ స్టోరేజీ ఫోన్లకు ఇప్పుడు కాలం చెల్లిందనే అనిపిస్తోందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.