ETV Bharat / science-and-technology

మానన జీవితాలను మార్చే శక్తి.. ఐఓటీ!

ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చిన ఘనత ఇంటర్నెట్​కు దక్కుతుంది. ఇంటర్నెట్ రాకతో ప్రపంచంలో చాలా విషయాల్లో మార్పు వచ్చింది. ఎన్నో పనులను సులభతరం చేసింది. మానవ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా చేసేందుకు వస్తోన్న మరో టెక్నాలజీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT).

internet of things(iot
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
author img

By

Published : May 29, 2021, 6:29 AM IST

ప్రతి ఇంట్లో ఇప్పుడు స్మార్ట్ పరికరాలు ఉన్నాయి. అయితే ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేయటం ప్రస్తుతానికైతే చాలా తక్కువ. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT) ద్వారా ఈ పరికరాలన్నీ ఒకదానితో మరోటి కనెక్ట్ అయి తెలివిగా నిర్ణయం తీసుకుంటాయి. ఉదాహారణకు ఇంట్లో ఫ్యాన్, లైట్, ఇతర పరికరాలను వాటికవే నియంత్రించుకుంటాయి.

సాంకేతికంగా చూసుకున్నట్లయితే ప్రతి స్మార్ట్ పరికరం కొంత మొత్తంలో డాటాను సేకరిస్తుంది. వీటిని విశ్లేషిస్తూ ఇంటర్ కనెక్టెడ్ పరికరాలు పనిచేస్తాయి. దీనికోసం క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధను ఉపయోగించుకుంటాయి.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కు మానన జీవితాలను మార్చివేసే శక్తి ఉంది. ఏఏ అంశాల్లో కీలకమైన మార్పులు తీసుకువస్తుందో తెలుసుకుందాం

ఎలక్ట్రానిక్స్: కొన్ని రోజుల క్రితం కేవలం స్మార్ట్ ఫోన్లకు మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉండేది. ప్రస్తుతం ప్రతీ పరికరానికి నెట్ కనెక్షన్ ఉండాలని కోరుకుంటున్నారు. దీనికోసం అవి కూడా స్మార్ట్ రూపంలోకి మారిపోతున్నాయి. టెలివిజన్లు, రిఫ్రిజరేటర్లు, స్పీకర్లు, హోమ్ సెక్యూరిటీ సిస్టమ్​లు స్మార్ట్​గా మారిపోయాయి. హృదయ స్పందన,క్యాలరీలు, నిద్ర నాణ్యత తదితర ఫిట్ నెస్ అంశాలను తెలుసుకునేందుకు ఇప్పటికే స్మార్ట్ వాచ్, ఫిట్ నెస్ బ్యాండ్​లను వాడుతున్నారు. భవిష్యత్తులో వీటి విషయంలో మరింత పురోగతి వస్తుంది. ముందే ఇచ్చిన కమాండ్స్​కు అనుగుణంగా వాటంతట అవే పనిచేసే వెసులుబాటు భవిష్యత్తులో ఉంటుంది.

స్మార్ట్ హోమ్స్: ఇంటిని పూర్తి అధునాతనంగా మార్చే శక్తి ఐఓటీకి ఉంది. ఇంట్లోకి వెళ్లాక ఫ్యాన్, ఏసీ తదితరాలను ఆన్ చేసుకోవటం చాలా మందికి అలవాటు. ఐఓటీ సాంకేతికతో మనం ఇంటిలోకి ప్రవేశించగానే ఏసీ దానికదే ఆన్ అవుతుంది. లేదా ఇంటికి వెళ్లేకంటే ముందే ఏసీ ఆన్ చేసుకునే వీలు ఉంటుంది. స్మార్ట్ గ్యాడ్డెట్​లు, స్మార్ట్ పరికరాలతో ఇంటి లోపలి అనుభూతి పూర్తిగా మారిపోనుంది.

కార్లు: కనెక్టెడ్ కార్లకు సంబంధించి ఇప్పటికే ప్రోటోటైప్​లను పలు కంపెనీలు అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి అంతిమ వినియోగదారులకు చేరేందుకు కొంత సమయం పట్టవచ్చు. ఐఓటీ ద్వారా కార్డు, డ్రైవర్లు, ఇతర రకాల మౌలిక సదుపాయాలు సంభాషించుకొని సురక్షితమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. అంతేకాకుండా ట్రాఫిక్ మేనేజ్​మెంట్, పార్కింగ్ మేనేజ్​మెంట్ లాంటి వాటిని సమర్థంగా నిర్వహించుకోవచ్చు.

స్మార్ట్ సిటీ: ఈ సాంకేతికతతో కార్లు, ఇళ్లతో పాటు నివసించే నగరాలు సైతం పూర్తి స్మార్ట్​గా మారిపోనున్నాయి. నీళ్లు, విద్యుత్, గ్యాస్, చెత్త నిర్వహణ పూర్తి స్మార్ట్​గా మారిపోనుంది. ప్రజా రక్షణ, మొబిలిటీలూ ఐఓటీ సాంకేతికతో సులభతరం కానున్నాయి. ప్రభుత్వ నిర్మిస్తోన్న స్మార్ట్ సిటీలను ఈ దిశగా వేస్తున్న అడుగులు అనుకోవచ్చు. వీటి ద్వారా విద్యుత్, మానవ వనరులు, నీటి నిర్వహణ సమర్థవంతంగా చేసుకోవచ్చు.

స్మార్ట్ వ్యవసాయం: ఐఓటీతో ఇళ్లు, కార్డు, వియరేబుల్స్​లలో మాత్రమే కాకుండా వ్యవసాయంలోనూ భారీ మార్పు రానుంది. క్షేత్ర స్థాయిలో వాతావరణం, తేమ ఇతర అంశాల ఆధారంగా వ్యవసాయ పనులు జరిగిపోనున్నాయి. నీళ్లు అందించటం, క్రిమి సంహారక మందుల పిచికారీ స్మార్ట్ పరిరకరాల ద్వారా జరగనుంది. దీనివల్ల వ్యవసాయంలో ఉత్పాదకత అధికం కానుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార అవసరాలు తీర్చటంలో ఈ సాంకేతికత ఉపయోగపడనుంది.

ఇండస్ట్రీ 4.0: తయారీ రంగంలో ఆటోమేషన్, డాటా ఎక్సేంజీని తెలిపేదే 'ఇండస్ట్రీ 4.0' లేదా నాలుగో పారిశ్రామిక విప్లవం. ఇందులో మెషిన్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకొని.. అందుబాటులో ఉన్న సమాచారానికి అనుగుణంగా తయారీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటాయి. దీని ద్వారా ఉత్పత్తి ఖర్చు తగ్గటమే కాకుండా తయారీ కూడా సమర్థవంతంగా జరుగుతుంది.

ఇవీ చదవండి: విద్యార్థులు మెచ్చిన సరికొత్త టెక్నాలజీలు ఇవే!

'ఐఓటీ'.. భారీ సంఖ్యలో ఉద్యోగాలు క‌ల్పించే టెక్నాల‌జీ

2022 నాటికి 13.3కోట్ల ఉద్యోగాలు: ఐబీ హబ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.