How to Transfer WhatsApp Data from Old iPhone to iPhone 15: ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్ 15 ఇప్పుడు మార్కెట్లో ఉంది. చాలా మంది ఈ ఫోన్ కొనుగోలు చేస్తున్నారు. మరి.. అప్పటి వరకూ వినియోగించిన పాత ఐఫోన్‌లోని వాట్సాప్ డేటా సంగతేంటి? అందులో వదిలేయాల్సిందేనా..? అంటే.. అవసరం లేదు. కొత్త ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది ఏయే పద్ధతుల ద్వారా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాత ఐఫోన్(iPhone) నుంచి iPhone15కి వాట్సాప్‌ను బదిలీ చేయడానికి అధికారిక పద్ధతులు..
Official Methods to Transfer WhatsApp Data from Old iPhone to iPhone 15: మీరు రెండు అధికారిక మార్గాల్లో కొత్త ఐఫోన్లోకి WhatsApp డేటాను బదిలీ చేయవచ్చు. మీరు సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేయకుండానే సులభంగా WhatsApp డేటాను ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
Method 1: iCloud(ఐక్లౌడ్): ఒక iOS యూజర్‌కు.. iCloud ప్రయోజనాల గురించి తెలిసి ఉండాలి. ఇది ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫారమ్. ఈ ఐక్లౌడ్‌ను ఉపయోగించి WhatsAppను ఎలా బదిలీ చేయాలంటే..
- ముందుగా.. మీ పాత iPhoneలో WhatsApp సెట్టింగ్‌లను నావిగేట్ చేయండి.
- సెట్టింగ్‌లను ఓపెన్ చేసిన తర్వాత.. "చాట్లు", "చాట్ బ్యాకప్" ఎంచుకోండి.
- దీని తర్వాత, "బ్యాక్ అప్ నౌ" ఫీచర్‌ను క్లిక్ చేయండి.
- అనంతరం మీ పాత iOS పరికరం నుంచి మొబైల్ నెంబర్‌ను తీసివేయండి లేదా WhatsAppని తొలిగించండి.
- ఇప్పుడు, మీరు మీ కొత్త iPhoneలో WhatsAppని ఇన్స్టాల్ చేయండి.
- WhatsAppని ఇన్స్టాల్ చేసిన తర్వాత, మీరు కొనసాగించడానికి మీ WhatsApp నెంబర్‌ను నమోదు చేయాలి.
- WhatsApp సంభాషణలను పునరుద్ధరించడానికి “Restore Chat History” ఎంపికపై క్లిక్ చేసి.. “Next ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- అంతే.. మీ WhatsApp చాట్లు మీ కొత్త iPhoneకి బదిలీ చేయబడతాయి.
Method 2: Transfer Chats to iPhone
ఐఫోన్‌కు చాట్లను బదిలీ చేయడం: ఈ ఫీచర్‌ని ఉపయోగించి మీరు మీ పూర్తి WhatsApp డేటాను iPhone 15కి తరలించవచ్చు. అయితే.. ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి మీరు రెండు iPhoneలలో అప్డేటెడ్ iOS వెర్షన్ కలిగి ఉండాలి. అలాగే మీ iOS పరికరం ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మీరు iPhone 15లో కూడా అదే WhatsApp నెంబర్ని ఉపయోగించాలి.
- WhatsApp సెట్టింగ్‌లను ఓపెన్ చేయడానికి మీ పాత iPhoneని ఉపయోగించాలి.
- "చాట్లు", Transfer Chats to iPhone ఆప్షన్‌ను ఎంచుకుని అనంతరం Start బటన్‌ను క్లిక్ చేయాలి.
- QR కోడ్‌ని స్కాన్ చేయడానికి స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వమని మీ పాత iPhone మిమ్మల్ని అడుగుతుంది.
- ఇప్పుడు, మీ కొత్త iPhone 15లో WhatsAppని ఇన్స్టాల్ చేయాలి.
- మీ పాత iPhoneని ఉపయోగించి మీ కొత్త iPhoneలో QRని స్కాన్ చేయండి.
- మీరు కొనసాగించడానికి మీ WhatsApp నెంబర్‌ను నమోదు చేయాలి.
- దీంతో.. మీ WhatsApp చాట్లు మీ కొత్త iPhoneకి బదిలీ చేయబడతాయి.
WhatsApp డేటాను బదిలీ చేయడానికి అధికారిక పద్ధతులను ఉపయోగిస్తే వచ్చే సమస్యలు..
Drawbacks of Using the Official Methods for Transferring the WhatsApp Data: WhatsApp డేటాను బదిలీ చేసే అధికారిక పద్ధతులను ఉపయోగించడం ద్వారా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు.
- సమయం (Time Consuming:): అధికారిక పద్ధతులను ఉపయోగించి WhatsApp డేటాను బదిలీ చేయడానికి చాలా సమయం పడుతుంది. మీకు చాలా చాట్లు, వీడియోలు, ఫొటోలు ఉంటే.. దానికి గంటలు కూడా పట్టవచ్చు.
- ఇంటర్నెట్ డిపెండెన్సీ(Internet Dependency): మీ ఇంటర్నెట్ నెమ్మదిగా ఉండి.. లేదా అది పని చేయడం ఆపివేసినట్లయితే బదిలీ విఫలమవుతుంది. కాబట్టి ఫైల్‌లను బదిలీ చేయడానికి ముందు మీ ఇంటర్నెట్ కనెక్టివిటీని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి.
- అసంపూర్ణ బదిలీ(Incomplete Transfer): కొన్నిసార్లు మీ అన్ని చాట్లు, మీడియా బదిలీ కావు. అలాగే కొన్ని ఫైల్స్ కూడా మిస్సింగ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.
- సంక్లిష్ట ప్రక్రియ(Complex Process): అధికారిక పద్ధతులను ఉపయోగించి WhatsApp బదిలీ చేసే దశలు అందరికీ సులభం కాదు. సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తులకు ఈ విధానం కొంచెం కష్టమే. వారు ఇతరుల నుంచి సహాయం పొందవలసి ఉంటుంది.
- ఒకే ఖాతా పరిమితి(Single Account Limit): డేటా బదిలీ కోసం మీరు రెండు ఫోన్లలో ఒకే ఫోన్ నంబర్‌ను ఉపయోగించాలి. మీరు మీ కొత్త ఫోన్లో కొత్త నంబర్ని ఉపయోగించాలనుకుంటే ఈజీ కాదు.
IPhone 15 Offers : యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. రూ.31 వేలకే ఐఫోన్ 15.. ఎలా పొందాలో తెలుసా!